వైసీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య.. ఫ్రేములో రోజా కూడా!

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 03:30 PM IST
వైసీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య.. ఫ్రేములో రోజా కూడా!

Updated On : January 22, 2020 / 3:30 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో సీఆర్డీఏ రద్దు, ఏపీ అభివృద్ది వికేంద్రీకరణ వంటి అంశాలపై చర్చలు జరుగుతుండగా.. మండలిలో వాతావరణం హీటెక్కింది. ఇదిలా ఉంటే టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా తెలుగుదేశం ఎమ్మెల్యే సీనీ నటుడు బాలకృష్ణతో ఏఐసీసీ ఛైర్మన్ రోజా, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మండలి సమావేశాలను చూసేందుకు చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యాలవుల కేశవ్ మండలి విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు. కాసేటికి ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం అక్కడికి వచ్చారు. గ్యాలరీలో బాలకృష్ణ, రోజా మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అంతేకాదు వారిద్దరు సెల్ఫీలు సైతం తీసుకున్నారు. ఆ సెల్ఫీల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 

కాసు మహేష్ రెడ్డి, రోజా, బాలకృష్ణ, వసంత కృష్ణ ప్రసాద్.. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.