విశాఖలో మొదటి రోబో పోలీస్ : మీ సమస్యలు చెప్పుకోండి

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 04:29 AM IST
విశాఖలో మొదటి రోబో పోలీస్ : మీ సమస్యలు చెప్పుకోండి

Updated On : November 20, 2019 / 4:29 AM IST

స్మార్ట్‌ సిటీ విశాఖపట్నంలో పోలీస్ సర్వీసులు మరింత స్మార్ట్ అయ్యాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. రోబో పోలీస్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా కంప్లైంట్స్ చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లనక్కరలేదు. రోబో పోలీస్ కు దగ్గరకు వెళ్లి మీ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు.

విశాఖపట్నంలోని మహారాణిపేట సిటీ పోలీస్ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా రోబో (మిస్. సైబీరా రోబోకప్లర్)ను నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా నవంబర్ 18న ప్రారంభించారు. ఈ రోబోను విశాఖలోనే తయారు చేయటం మరో విశేషం.

విశాఖలోని రోబో కప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఈ రోబో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి కంప్లైంట్స్ తీసుకుని సంబంధిత అధికారికి పంపిస్తుంది. కంప్లైంట్ చేసిన వ్యక్తి ఫోటోను కూడా ఈరోబో తీసుకుంటుంది. ఇచ్చిన కంప్లైంట్ కు సంబంధించి సమస్యను 24 గంటల్లో పరిష్కరించేందుకు టైమ్ కూడా ఇస్తుంది. తరువాత ఆ కంప్లైంట్ స్వాల్వ్ కాకుంటే నేరుగా సీఎం కార్యాలయానికి బదిలీ చేస్తుంది.

స్టేషన్‌కు వచ్చే బాధితులు ఎవరైనా తమ కంప్లైంట్ రోబో ద్వారా అందజేయవచ్చు. సందరు ఫిర్యాదుదారుడ ఫిర్యాదు రాసేందుకు వీలుగా రోబోకు ఓ ట్యాబ్‌ను అమర్చారు. దానిపై ఫిర్యాదును టైప్‌ చేస్తే ఆ కాపీ సిబ్బందికి ప్రింట్‌ రూపంలో వెళ్లిపోతుంది. ఈ మహిళా రోబో పోలీస్ కు విశాఖపట్నంలోని దబాగార్డన్స్ ప్రాంతానికి చెందిన మహిళ నుంచి మొట్టమొదటి ఫిర్యాదు కూడా అందింది.

పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చినవారు భయపడొచ్చు. ఒత్తిడికి గురవ్వవచ్చు..కానీ రోబోపోలీస్ తో తమ సమస్యను చెప్పుకోవటానికి సౌకర్యంగా ఫీలవ్వవచ్చనీ ఇది ప్రజలకు సహాయకారిగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.