సీఎం ప్రారంభించిన నెలకే కుప్ప‌కూలిన బ్రిడ్జి..రూ. 264 కోట్లు గంగపాలు

  • Published By: nagamani ,Published On : July 16, 2020 / 12:59 PM IST
సీఎం ప్రారంభించిన నెలకే కుప్ప‌కూలిన బ్రిడ్జి..రూ. 264 కోట్లు గంగపాలు

Updated On : July 16, 2020 / 5:04 PM IST

కాంట్రాక్టర్లు..రాజకీయ నాయకుల స్వార్థంతో ఒకటి కాదు రెండుకాదు 10 కాదు 20 కూడా కాదు ఏకంగా రూ.260 కోట్ల రూపాయలు గంగపాలైపోయాయి. సాక్షత్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సీఎం ప్రారంభించి నెల రోజుకూడా పూర్తవ్యవలేదు..కేవలం 29 రోజులైంది. అప్పుడే ఈ బ్రిడ్జ్ కూలిపోయింది. నిర్మాణంలో ఎంతటి డొల్లతనం ఉందో..ఎంత అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చు.

బీహార్ ల్లో కురుస్తున్నభారీ వర్షాలకు కురుస్తుండటంతో రాష్ర్టంలోని న‌దులు, సాగునీటి ప్రాజెక్టుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. గోపాల్ గంజ్ జిల్లాలోని గండ‌‌క్ న‌దిపై నిర్మించిన స‌త్తార్ ఘాట్ బ్రిడ్జి వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో కుప్ప‌కూలిపోయింది. కొత్త‌గా నిర్మించిన ఈ బ్రిడ్జిని జూన్ లో సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభించి నెల రోజులు కూడా పూర్తవ్వకుండానే కుప్పకూలిపోయింది. దీని కోసం ఖర్చు పెట్టిన రూ.264 కోట్ల రూపాయల్ని నీటిపాలు అవ్వటం విమర్శలకు దారి తీసింది.

ఈ బ్రిడ్జి రూ. 264 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. బ్రిడ్జిని ప్రారంభించిన 29 రోజుల‌కే కుప్ప‌కూలిపోవ‌డంతో స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి అవినీతికి పాల్పడి ఏమాత్రం నాణ్యత లేకుండా బ్రిడ్జి నిర్మించ‌డంపై ప్ర‌భుత్వాన్ని ప్రజలు నిల‌దీస్తున్నారు. ఈ బ్రిడ్జి కూలిపోవ‌డంతో.. చంపార‌న్, స‌రన్ తో పాటు మ‌రిన్ని జిల్లాల‌కు సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు విమర్శలు కురిపిస్తున్నారు.