లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

ఓవైపు ఎన్నికల హడావుడి.. మరోవైపు పార్టీల విమర్శలు.. సూర్యుని ప్రతాపం కంటే రాజకీయ హీట్ ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది.

  • Published By: vamsi ,Published On : April 5, 2019 / 04:17 AM IST
లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Updated On : April 5, 2019 / 4:17 AM IST

ఓవైపు ఎన్నికల హడావుడి.. మరోవైపు పార్టీల విమర్శలు.. సూర్యుని ప్రతాపం కంటే రాజకీయ హీట్ ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఓవైపు ఎన్నికల హడావుడి.. మరోవైపు పార్టీల విమర్శలు.. సూర్యుని ప్రతాపం కంటే రాజకీయ హీట్ ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనం అవుతుంది. ఆమె దగ్గర అనుచరుడిగా ఉన్న కోఠి అనే వ్యక్తి  లక్ష్మీ పార్వతి పై ఊహించని విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టాడు.
Read Also : విజయవాడలో ధర్నాకు దిగిన చంద్రబాబు

వైసీపీ నేత ల‌క్ష్మీ పార్వ‌తి త‌న‌ను లైంగికంగా వేధిస్తుంద‌ని, త‌ల్లిలాంటి భావ‌న‌తో ఉన్న త‌నను వేధించ వద్దని ఎంత వేడుకున్నా ఆమె విన‌ట్లేద‌ని కోఠి అనే వ్య‌క్తి గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అంతేకాకుండా తాను చెప్పిన‌ట్టు వింటే వైసీపీలో మంచి ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని, లేదంటే ఇబ్బంది పడవంటూ బెదిరిస్తుందని ఫిర్యాదులో వెల్లడించాడు కోఠి.

ఫిర్యాదుతో పాటు.. లక్ష్మీపార్వతి చాట్ చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్, డియో టేపులను కూడా కోఠి పోలీసులకు అందించారు. అందులో ఐ లవ్ యూ అంటూ..  లక్ష్మీపార్వతి మెసేజ్‌లు పెట్టినట్లుగా ఉంది. విడుదలైన ఆడియో టేపుల్లో ఎన్టీఆర్‌పై ఏ మాత్రం గౌరవం లేకుండా లక్ష్మీపార్వతి మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం నాదెండ్ల భాస్కర్ రావు చేసిన ఆరోపణలు, మోహన్ బాబును వెస్ట్ ఫెలో అనడం వంటివి అందులో వినిపిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also : కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా