YSRCPలో నయా జోష్ : విజయమ్మ, షర్మిల ప్రచారం

YSRCP కి కొత్త జోష్‌ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ  అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం  నిర్వహిస్తున్నారు.

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 01:43 AM IST
YSRCPలో నయా జోష్ : విజయమ్మ, షర్మిల ప్రచారం

Updated On : March 30, 2019 / 1:43 AM IST

YSRCP కి కొత్త జోష్‌ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ  అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం  నిర్వహిస్తున్నారు.

YSRCP కి కొత్త జోష్‌ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ  అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం  నిర్వహిస్తున్నారు. అధికార పక్షాన్ని ఎండగడుతూ , తామ అమలు చేయబోయే పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటూ  సాగిపోతున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా తల్లి విజయమ్మ,  సోదరి షర్మిల ప్రచారం చేస్తున్నారు. విడివిడిగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.
Read Also : లోకేష్ పప్పు.. పప్పు : జయంతికి.. వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల

ప్రకాశంలో విజయమ్మ : – 
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విజయమ్మ అక్కడి నుంచి కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. YS రాజశేఖర్‌ రెడ్డి పాలనను తిరిగి తీసుకురావాంటే అది  జగన్‌ వల్లే సాధ్యమవుతుందని విజయమ్మ అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజలతోనే మమేకమై ఉన్న జగన్‌ను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని విజయమ్మ ఆరోపించారు. 

మంగళగిరిలో షర్మిల : – 
షర్మిల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిరోజు మంగళగిరి  నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో  భూసేకరణ బాధితులతో వైఎస్‌ షర్మిల ముఖాముఖి  నిర్వహించారు. ఉండవల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,  బెదిరించి తమ భూములు లాక్కున్నారని బాధితులు,  గ్రామస్తులు షర్మిలకు తెలియజేశారు.. చంద్రబాబుకు  కావాల్సినవారికి తమ భూములు కట్టబెట్టారని గ్రామస్తులు  ఆరోపించారు. ముఖ్యమంత్రి అనే వారు ప్రజల సేవ కోసం ఉండాలి కానీ  అధికారం చెలాయించడానికి కాదన్నారు వైఎస్‌ షర్మిల.  చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దుర్మార్గంగా  వ్యవహరించారని ఆమె విమర్శించారు. విజయమ్మ, షర్మిల ప్రచారంతో వైసీపీ కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది.
Read Also : Social Media లో YCP : ట్రెండింగ్‌లో రావాలి జగన్..సాంగ్