సన్‌రైజర్స్ : విలియమ్సన్ లేకపోతే అతనే కెప్టెన్?

ఐపీఎల్ 2017 వరకూ జట్టు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో లీగ్‌కు దూరమైయ్యాడు.

సన్‌రైజర్స్ : విలియమ్సన్ లేకపోతే అతనే కెప్టెన్?

Updated On : March 23, 2019 / 11:35 AM IST

ఐపీఎల్ 2017 వరకూ జట్టు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో లీగ్‌కు దూరమైయ్యాడు.

ఐపీఎల్ 2017 వరకూ జట్టు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో లీగ్‌కు దూరమైయ్యాడు. సందిగ్ధ పరిస్థితుల్లో విలియమ్సన్‌ను నమ్ముకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కేన్ విలియమ్సన్‌ను నమ్ముకుంది. ఈ సీజన్‌కు డేవిడ్ వార్నర్ అందుబాటులోకి రావడం, కొద్ది రోజులుగా భుజానికి గాయమై కేన్ విలియమ్సన్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరవకపోవడంతో కెప్టెన్సీపై అందరికీ సందేహాలు మొదలైయ్యాయి. విలియమ్సన్ లేని సమయంలో వార్నర్ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడని అనుకుంటున్న వారందరికీ షాక్ ఇచ్చింది మేనేజ్ మెంట్. 
Read Also : IPL 2019, CSKvRCB: తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిందెవరంటే..

టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను విలియమ్సన్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తోంది సన్‌రైజర్స్.  వీవో ఐపీఎల్ 12 సీజన్‌లో భాగంగా పోస్టర్ కోసం 8 జట్ల కెప్టెన్లు హాజరుకావాల్సి ఉంది. కానీ, విలియమ్సన్ ప్రత్యేక కారణాలతో అందుబాటులో లేకపోవడంతో అతని స్థానాన్ని భువీ పూర్తి చేశాడు. అంటే హైదరాబాద్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ అంటూ చెప్పకనే చెప్తుంది సన్‌రైజర్స్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్‌లో తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మార్చి 24న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. ఆదివారం జరగనున్న 2 మ్యాచ్‌లలో ముందుగా SRHvKKR ఆ తర్వాత MIvDC మ్యాచ్ లు జరగనున్నాయి. విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు కూడా సిద్ధంగా లేకపోతే కోల్‌కతా వేదికగా జట్టును నడిపించేందుకు భువీ సిద్ధంగా ఉన్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్‌లో భువీకి కెప్టెన్‌గా ఇదే తొలి మ్యాచ్..