నిరుద్యోగులకు సూపర్, డూపర్ స్కీం ప్రకటించిన సీఎం జగన్

రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ ఉంటుందన్నారు.

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 09:15 AM IST
నిరుద్యోగులకు సూపర్, డూపర్ స్కీం ప్రకటించిన సీఎం జగన్

Updated On : October 25, 2019 / 9:15 AM IST

రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ ఉంటుందన్నారు.

ఏపీ సీఎం జగన్ నిరుద్యోగులకు సూపర్, డూపర్ స్కీం ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అమరావతిలో శుక్రవారం (అక్టోబర్ 25, 2019) మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి, సురేష్, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉద్యోగం, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ ఉంటుందన్నారు.

యూనివర్సిటీ కింద ప్రతి పార్లమెంట్ లో ఒక స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ పరిధిలో 25 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అవసరమైన శిక్షణ ఇవ్వడం వర్సిటీల బాధ్యత అన్నారు.

చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి పొందాలన్నదే లక్ష్యమన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అదనంగా ఏడాది అప్రంటిస్ ఉంటుందని వెల్లడించారు. నెల రోజుల్లోనే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.