నో ముక్కా నో చుక్కా : ఆ ఊర్లో ఆదివారం మాంసాహారం వండితే ఫైన్

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 10:30 AM IST
నో ముక్కా నో చుక్కా : ఆ ఊర్లో ఆదివారం మాంసాహారం వండితే ఫైన్

Updated On : December 22, 2019 / 10:30 AM IST

ఆదివారం వచ్చిదంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగనవారు ఉంటారు. సండే వచ్చిదంటే చికెన్..మటన్, చేపల కూరల వాసనలతో వంటిల్లు ఘుమఘుమలాడిపోతుంటుంది. కానీ ఓ ఊర్లో మాత్రం ఆదివారం మాంసాహారం వండితే జరిమానా వేస్తారు..ఈ ఆచారాన్ని ఒకటీ రెండూ వారాలు కాదు ఏకంగా 10 సంవత్సరాల నుంచి వస్తోంది ఆ ఆచారం. అది ఏ ఊరు…ఏమా సండ డ్రైడే కథ ఏంటో తెలుసుకుందాం..

చుట్టూ కొండలతో అలరారుతున్న గ్రామం పెద్దాపూర్. తెలంగాణ లోని జిగిత్యాల జిల్లా  మెట్ పల్లి మండలంలో ఉంది పెద్దాపూర్. ఈ పెద్దాపూర్ లో ఆదివారంనాడు మాంసాహారాన్ని ముట్టుకోరు. మద్యం అస్సలే తాగరు. అలా ఎవరైనా చేస్తే గ్రామ పెద్దలు జరిమానా విధిస్తారు. ఆదివారం నాడు ఆ గ్రామంలో నాన్ వెజ్ అమ్మనే అమ్మరు. ఈ ఆచారం వెనుక ఓ నియమం ఉంది ఆ నియమం వెనుక భక్తి ఉంది. 

పెద్దాపూర్ గ్రామస్థులు మల్లన్నను నమ్ముతారు. భక్తి శ్రద్దలతో కొలుస్తారు. గ్రామం మధ్యలో మల్లన్న స్వామికి ఓ దేవాలయం కట్టారు. ఈ మల్లన్న దేవుడికి ఆదివారం అంటే ఎంతో ఇష్టం. అందుకే గ్రామస్థులంతా ఆదివారం నాడు మల్లన్నను భక్తి శ్రద్దలతో కొలుచుకుంటారు. ఈ రోజున  మద్యంగానీ, మాంసం గానీ ముట్టరు. 

ఆదివారం మాంసం తినకూడదనీ..మద్యం తాగకూడదని పది సంవత్సరాల నాడు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తామని తీర్మానించారు. ఇలా పది సంవత్సరాలుగా పాటిస్తున్నారు. ప్రతీ ఏటా మల్లన్నకు ఉత్సవాలు చేస్తారు పెద్దాపూర్ గ్రామస్తులు. అలా మల్లన్న స్వామిపై ఉన్న భక్తిశ్రద్ధలతో గ్రామస్తులెవ్వరు ఆదివారం నాడు మాంసం గానీ..మద్యం గానీ ముట్టరు.