తెలంగాణ లోక్ సభ ఎన్నికలు : వివేక్ మద్దతు ఎవరికి

లాస్ట్ వరకు ఎంత ట్రై చేసినా... టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కలేదు. పార్టీ మారుదాం అనుకున్నా.. గెలుస్తామా లేదా అనే అనుమానం..

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 01:26 PM IST
తెలంగాణ లోక్ సభ ఎన్నికలు : వివేక్ మద్దతు ఎవరికి

Updated On : April 1, 2019 / 1:26 PM IST

లాస్ట్ వరకు ఎంత ట్రై చేసినా… టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కలేదు. పార్టీ మారుదాం అనుకున్నా.. గెలుస్తామా లేదా అనే అనుమానం..

లాస్ట్ వరకు ఎంత ట్రై చేసినా… టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కలేదు. పార్టీ మారుదాం అనుకున్నా.. గెలుస్తామా లేదా అనే అనుమానం.. దీంతో.. ఈసారికి పోటీ చేయొద్దులే అనే నిర్ణయించుకున్నారు మాజీ ఎంపీ వివేక్. మరి ఆయన అనుచరులు ఎవరికి సపోర్ట్ చేస్తారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్ధతిస్తారా.. లేదా.. ? పెద్దపల్లి పార్లమెంట్ స్థానంతో జి. వెంకటస్వామి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. కాకాతో పాటు ఆయన కుమారుడు ఈ నియోజకవర్గం నుంచి గెల్చి పార్లమెంట్‌లో కాలుపెట్టారు. ఈసారి మాత్రం వివేక్‌కు చుక్కెదురైంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉండటంతో.. ఆయనకు TRS పార్టీ టికెట్ కేటాయించలేదు.
Read Also : జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు : మోహన్ బాబు

అనుచరులతో వివేక్ భేటీ అయ్యారు. వేరే పార్టీలోకి వెళ్లడమా.. లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేయడమా అని చర్చలు జరిపినా.. చివరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకుని కామ్‌గా ఉండిపోయారు. ఏప్రిల్ 11వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. వివేక్ అనుచరులు ఎవరికి మద్దతిస్తారు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దశాబ్ధాల తరబడి ఇక్కడి ప్రజలతో మమేకమైన వారి కుటుంబానికి బలమైన ఓటు బ్యాంకే ఉంది. అనుచరులు కూడా భారీగానే ఉన్నారు. సామాజికవర్గం పరంగా కూడా నియోజకవర్గంలో వివేక్‌కు పట్టుందనే పేరుంది. దీంతో ఆయన అనుచరులు ఎవరికి ఓటేస్తారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

నియోజకవర్గం మొత్తంలో వివేక్‌కు సుమారు 3లక్షల సాంప్రదాయ ఓట్లు ఉన్నాయని ఒక అంచనా. వివేక్ పోటీకి దూరంగా ఉండటంతో.. ఇపుడా ఓట్లు కీలంకగా మారుతున్నాయి. వాళ్లంతా ఎవరికి ఓట్లేస్తారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనే ఆసక్తి ఏర్పడింది. ఎన్నికలకు పట్టుమని పది రోజలు కూడా టైం లేదు. అటు వివేక్ కూడా ఎవరికి సపోర్ట్ చేయాలి అనే విషయంలో… అనుచరులకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అయితే.. ఎన్నికల నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 
Read Also : మనకు మనమే పోటీ : ఢిల్లీని శాసిద్దాం – హరీష్