బాహుబలి రేంజ్ లో బ్రహ్మోత్సవాలు : మరో 30 ఏళ్లు జగనే సీఎం
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు..

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు..
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు.. మరో 30 ఏళ్లు జగనే సీఎం అని, మరొకరు సీఎం కాలేరు అని జోస్యం కూడా చెప్పారాయన. విశాఖ సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని పృథ్వీరాజ్ దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైనా స్పందించారు.
బాహుబలి రేంజ్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎస్వీబీసీ చానెల్ లో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆయన తీపి కబురు వినిపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మరోసారి చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు.