నన్ను ఇంట్లో పెడితే మీరు ఆపలేరు..ఆత్మకూరు వెళ్లి తీరుతానన్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. చలో ఆత్మకూరు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు చంద్రబాబు. చలో ఆత్మకూరు జరిగి తీరుతుందన్నారు. బాధితులందరినీ వారి గ్రామాలకు తరలించే వరకు పోరాడతామన్నారు. రాజీ పడే ప్రశక్తే లేదన్నారు. టీడీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలను గృహనిర్బంధంలో ఉంచార్ననారు. టీడీపీ నేతలను నిర్బధించడం దుర్మార్గమన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తనను హౌస్ అరెస్ట్ చేశారన్నారు.
గృహనిర్బంధాలతో మమ్మల్ని అడ్డుకోలేరంటూ ప్రభుత్వాన్ని బాబు హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని విమర్శించారు. నాయకులు తన ఇంటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని బాబు విమర్శించారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్ లు తిప్పుతున్నారన్నారు.
పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. పరిపాలించే వ్యక్తి క్యారెక్టర్ పు ఇది రిఫ్లెక్ట్ చేస్తుందని బాబు అన్నారు. ఈ దేశంలో నివసించే హక్కు,మాట్లాడే స్వేచ్ఛ,ఆస్తులకు,ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసులు కూడా దీన్ని అమలుచేయాలని బాబు అన్నారు. అదే విషయమై చలో ఆత్మకూరుకంటే ముందు 9రోజులు సమయమిచ్చామన్నారు. అందుకే ఇప్పుడు తాను వెళ్దామనుకున్నానని తెలిపారు.