వైసీపీ కుట్ర : బుద్ధా వెంకన్న అరెస్టు

ఈవీఎంలు మొరాయించడంలో వైసీపీ కుట్ర ఉందంటూ ధర్నా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గంచడం కోసమే వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఈవీఎంలు మొరాయిస్తున్నాయని..ఈసీకి బుద్ధా వెంకన్న కంప్లయింట్ చేశారు. అయితే..ఈసీ పట్టించుకోకపోవడంతో విజయవాడ బ్రాహ్మణ వీధిలో బుద్ధా వెంకన్న..ఇతర నేతలు ధర్నా చేపట్టారు. అక్కడ టెన్షన్ నెలకొంది.
చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి బుద్ధాతో పాటు ఇతర టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా బుద్ధాతో 10tv ముచ్చటించింది. రాష్ట్రం మొత్తం మీద ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఓట్లు వేయడానికి వచ్చిన వారు తిరిగి వెళుతున్నారని తెలిపారు. ఇదంతా వైసీపీ కుట్రనంటూ ఆరోపించారు. తాను ధర్నా చేయలేదని..పబ్లిక్ తనను కూర్చొబెట్టిందన్నారు. బాబు కోసం ప్రాణమైన ఇస్తామన్నారు బుద్ధా. ఈవీఎంలు కరెక్టు చూసుకుని పోలింగ్ నిర్వహించాలని ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు.