ఆస్తుల కోసం కేసిఆర్ కాళ్లు.. కేసుల కోసం మోడీ కాళ్లు

కేసిఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన జగన్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్న జగన్ దగ్గర నుంచి నామినేషన్ వేసిన అభ్యర్ధులు కూడా బయటకు రావాలని పిలుపునిచ్చారు. పగవాడికి కూడా అటువంటి కొడుకు వద్దని రాజశేఖర్ రెడ్డి అన్నారట.. నిజంగా ఇవాళ ఆయన బాధ ప్రజలకు తెలుస్తుందని బుద్దా వెంకన్న అన్నారు.
దేశ ద్రోహులకు ఎలాంటి శిక్ష వేస్తారో రాష్ట్ర ద్రోహి అయిన జగన్‌కు కూడా అటువంటి శిక్ష వేయాలని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ తన ఆస్తులు కాపాడుకోవడానికి కేసిఆర్ కాళ్లు, కేసుల నుండి కాపాడుకోవడానికి మోడీ కాళ్లు పట్టుకున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.
జగన్ విధానాలను ప్రతీ ఒక్కరూ ఛీ కొడుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్‌కు సీఎం కుర్చీపై ధ్యాసే తప్ప మరోటి లేదన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావని, జగన్‌ది భస్మాసుర హస్తమని బుద్ధా వెంకన్న అన్నారు.