పంచాయతీ సమరం : ఖమ్మంలో ప్రశాంతంగా పోలింగ్

ఖమ్మం : జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఖమ్మంలోని 6 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో7 మండలాలకు తొలి విడతగా జనవరి 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మధ్యాహ్నం 1గంటకు పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాల బాక్సులను సీజ్ చేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. గంట భోజన విరామం అనంతరం 2గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 22 మండలాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : 150 సర్పంచ్ స్థానాలు…1181 వార్డు మెంబర్లకు ఎన్నికలు
ఖమ్మంలో : 6 మండలాలకు ఎన్నికలు. 167 పంచాయతీలు. 1458 వార్డు సభ్యులకు ఎన్నికలు. 446 మంది సర్పంచ్ అభ్యర్థులు. 3215 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు.