టీడీపీకి తోట త్రిమూర్తులు రాజీనామా
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 13, 2019) రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ కార్యకర్తల సహకారం మరిచిపోలేనిదన్నారు. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను ప్రజల మనసును గెలుచుకున్నానని తెలిపారు.
చంద్రబాబు తన గురించి చాలా మాట్లాడారని చెప్పారు. ఆయన మాటలు తనను బాధించాయన్నారు. కొంతమంది నాయకులు తనతో పని చేయించుకుని వెళ్లారన్నారు. తానెప్పుడూ తన వ్యక్తిగత పనులు చేయించుకోలేదని తెలిపారు.
ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు వైఖరి వల్లే తోట త్రిమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానం : తోటి మావోయిస్టును చంపేశాడు