రాజధానికి పొలాలిచ్చి రోడ్డుమీద కూర్చునే ఖర్మ మాకేంటి

రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని ప్రభుత్వం వ్యాఖ్యల్ని ఆమె తప్పు పట్టారు. రాజధానికి పొలాలిచ్చి ఇళ్లు వదిలి ఇలా రోడ్డుమీద కూర్చోవాల్సిన ఖర్మ మాకేంటి? అని ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. కోట్లు విలువచేసే పొలాలను ప్రభుత్వానికి ఇచ్చి..ఇప్పుడు పండించుకునే దారిలేక..స్థలాలు అమ్ముకునే పరిస్థితి లేక..ఇన్ని కష్టాలు పడటానికి కారణమై సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం రైతుల కోసం రాజధాని కట్టటం లేదనీ..రాష్ట్రానికి సెంటర్ లో ఉంది కాబట్టి..భౌగోళికంగా అనువైనది ఉంది కాబట్టి ఆనాటి సీఎం చంద్రబాబు ఇక్కడ రాజధానిగా నిర్ణయించారు. దానికి అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా అంగీకరించింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక..రాజధానికి అమరావతి అనుకూలమైనది కాదంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎంతమాత్రం సరైనవి కాదనీ..ఇది రాజకీయ లబ్ది కోసం చేస్తున్న పనులేనని విమర్శించారామె.
ఐదు సంవ్సతరాల తరువాత రాజధానికి అనువైనది కాదని..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకు రాజధాని అమరావతి అనువైనది ఇప్పుడే తెలిసిందా అంటే ప్రశ్నించారు. రాజధానికి అమరావతి అనుకూలమైనది అంటు కమిటీ ఇచ్చిన నివేదిక ఇచ్చిన విషయం సీఎం జగన్ గుర్తించాలని అన్నారు.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడి రాజధాని శంకుస్థాపనకు కూడా వచ్చారని ఇప్పుడు రాజధానుల్ని మార్చి ప్రధానికి కూడా అవమానిస్తున్నారని ఆమె అన్నారు.
కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రంలోని అధికార..ప్రతిపక్షాలు కూడా రాజధాని నిర్మాణానికి అంగీకరించి ఇప్పుడు ఐదు సంవత్సరాల తరువాత వారి రాజకీయ లబ్ది కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇంట్లోనుండి బైటకు రాని మహిళల్ని నడిరోడ్డుపై కూర్చోబెట్టిన సీఎం జగన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.