ఆవులపై పెద్దపులి దాడి : భయాందోళనలో గ్రామస్తులు

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి ప్రజలకు భయాందోళనలకు గురిచేసింది. కోటపల్లి మండలం పంగిడిలో ఆవులపై పెద్దపులి దాడి చేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు నెలల నుంచి కోటపల్లి..ఆసిఫా బాద్ కొమరం భీమ్ జిల్లాల్లో పెద్ద పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది.
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాలకు వస్తున్నాయి. ఇలా వచ్చిన పెద్ద పులులు పంగిడి సోమారం ప్రాంతంలోని ఐదు ఆవులపై ఓ పెద్దపులి దాడిచేసింది. దీంతో స్థానికులు ఎటువైపు నుంచి పులులు దాడిచేస్తాయోనని భయపడుతున్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నారు.