కృష్ణా జిల్లాలో పులే కాపలా!

ఊర్లలో కోతుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. చిన్న చిన్న దుకాణాల్లో అయితే అవి చేసే పనులు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. అడవులు అంతరించి పోతుండడంతో అడువులలో ఉండే కోతులు గ్రామాల్లోకి వచ్చేశాయి. దీంతో ఎక్కడ చూసినా గ్రామాల్లో కోతుల గోల ఎక్కువయ్యింది.
వానర సైన్యం ఇళ్లలోకి చొరబడి ఏ వస్తువుల కనిపించినా వాటిని ఎత్తుకుపోతూ.. అలాగే అంగళ్లలో సమాన్లు లాగేస్తూ… రైతులు పండించిన పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో కోతుల బాధను తీర్చేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు జనం.
అందులో భాగంగానే లేటెస్ట్ గా కృష్ణా జిల్లాలోని నూజివీడు, ఆగిపల్లి పరిసర ప్రాంతాల్లో మామిడి తోటల్లో కాయలను తెంపేస్తున్న వానరాల ఆట కట్టించేందుకు రైతులు పులులను కాపలాగా పెడుతున్నారు. అవి నిజం పులులు అనుకుంటే పొరపాటే. అవి బొమ్మ పులులు. వాటిని దుకాణాలు, ఇళ్లు, పొలాల్లో పులే కాపలా ఉన్నట్లుగా పెడుతున్నారు.
పులిలా ఉన్న బొమ్మలను చూసి వానరాలు రావట్లేదు. బాపుపాడు మండలంలోని వీరపల్లి గ్రామంలో ఓ దుకాణంపై ఏర్పాటు చేసిన పులిబొమ్మను ఫోటోలో చూడవచ్చు.