శ్రీవారి లడ్డూ : టీటీడీ కీలక నిర్ణయం
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా

టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అలాగే కొండపై దశలవారీగా ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. కలియుగ వైకుంఠం తిరుమలలో ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు మరింత పటిష్టం చేశారు. గత పాలకమండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమలలో మూడు దశల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధిస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో టీటీడీ కార్యాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధం చేపడతామన్నారు. 15 రోజుల్లో అతిథి గృహాలు, హోటళ్లలో వాటర్ బాటిళ్ల వాడకం నిషేధిస్తామని, వీటికి ప్రత్యామ్నాయంగా వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారాయన.
పాలకవర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసిన టీటీడీ పాలకమండలి.. ప్రభుత్వ అనుమతి కోసం పంపింది.
మరోవైపు శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు బార్ కోడ్ విధానం ద్వారా లడ్డూలు అందిస్తామన్నారు. కేవలం దర్శనం చేసుకున్న వారికి మాత్రమే లడ్డూలు ఇస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే జీఎంఆర్ సంస్థ ద్వారా తిరుమలలో ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలో తిరుమల రాయ మండపంలో తులాభారం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
తిరుమలలో 15 రోజుల క్రితం 23 మంది లడ్డూ దళారులను భద్రతా సిబ్బంది గుర్తించారని అదనపు ఈవో తెలిపారు. ఈ క్రమంలో లడ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రెండంచెల స్కానింగ్ విధానాన్ని 30 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్సుల్లో మొదట లడ్డూ టోకెన్లను స్కాన్ చేసి భక్తులకు అందిస్తారని, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని స్కానింగ్ పాయింట్ దగ్గర మరోసారి స్కాన్ చేసేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రెండోసారి స్కాన్ చేసిన సమాచారం మాత్రమే లడ్డూ కౌంటర్లకు చేరుతుందన్నారు. పీఏసీల్లో లాకర్లు కేటాయించే సమయంలో తాళం చెవిని భక్తులకు అందిస్తామని, ఖాళీ చేసేటపుడు భక్తులు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇకపై దర్శనం చేసుకున్న భక్తులందరికీ 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఒకటి ఉచితంగా ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది.