కోడెల అంత్యక్రియల్లో ట్విస్ట్ : ప్రభుత్వ లాంఛనాలతో జరిపేందుకు కుటుంబసభ్యుల తిరస్కరణ

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియల విషయం మలుపు తిరిగింది. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జగన్ ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 02:03 AM IST
కోడెల అంత్యక్రియల్లో ట్విస్ట్ : ప్రభుత్వ లాంఛనాలతో జరిపేందుకు కుటుంబసభ్యుల తిరస్కరణ

Updated On : September 18, 2019 / 2:03 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియల విషయం మలుపు తిరిగింది. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జగన్ ప్రభుత్వం

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియల విషయం మలుపు తిరిగింది. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కోడెల కుటుంబసభ్యులు తిరస్కరించారు. ప్రభుత్వ లాంఛనాలతో చేసేందుకు మేము ఒప్పుకునేది లేదు అంటున్నారు.

దీనిపై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు స్పందించారు. కోడెల మృతితో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, ఆ కారణంతోనే కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను వద్దనుకున్నారని ఆంజనేయులు తెలిపారు. నరసరావుపేటలో ఉదయం 11 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందన్నారు. పట్టణ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో దహన సంస్కారాలు జరుగుతాయని చెప్పారు. కోడెల అంత్యక్రియల ఊరేగింపుపై నిషేధాజ్ఞలు లేవని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ వెల్లడించారు.

ప్రభుత్వ లాంఛనాలు వద్దని కోడెల కుటుంబసభ్యులు చెప్పడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు కోడెల అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 18,2019) నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు, పార్టీ నేతలు పాల్గొననున్నారు.

సోమవారం(సెప్టెంబర్ 16,2019) హైదరాబాద్‌లో తన ఇంట్లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. కోడెల మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కోడెల మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. కాగా కోడెల మృతి కేసు రాజకీయ మలుపు తిరిగింది. కోడెల మృతికి జగన్ ప్రభుత్వమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తీరు వల్లే కోడెల చనిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం కోడెల మరణంపై రాజకీయాలు చేయొద్దనీ, తమను మరింత కుంగదీయొద్దనీ వేడుకుంటున్నారు.

సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో టిఫిన్ చేసిన కోడెల… 10.10కి తన రూమ్ లోకి వెళ్లారు. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు సహా ఏడుగురు ఉన్నారు. 10.40కి ఆయన్ని బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్ పడిపోయినా డాక్టర్లు 40 నిమిషాలపాటు… బతికించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కోడెలది ఆత్మహత్య అని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.