నూకలున్నాయి:మీదకు దూసుకొచ్చిన రెండు లారీల మధ్య నుంచి భలే తప్పించుకున్నాడు

ఏదైనా ఊహించని ప్రమాదం నుంచి తప్పించుకుంటే వీడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయిరా..భలే తప్పించుకున్నాడు అంటారు. అదృష్టం కలిసి వస్తే అలాగే జరుగుతుంది..లేదంటే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది అంటారు. అటువంటి ఘటనే జరిగింది ఓ వ్యక్తికి. పెద్ద ప్రమాదం నుంచి భలే తప్పించుకున్నాడు. దానికి అతని అదృష్టం తోడైందో లేక..ఇంకా ఆయుష్షు ఉండి బైటపడ్డాడో గానీ రెండు లారీ నుంచి తప్పించుకుని బ్రతికి బైటపడ్డాడు.
వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి సమీపంలోని చౌరస్తాలో లారీలు బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై వెళ్లాల్ని రెండు లారీలు డివైటర్ మీదకు దూసుకెళ్లాయి. ముందు వెళ్తున్న ఓ లారీని వెనుక వస్తున్న మరో లారీ ఓవర్ టేక్ చేసందుకు డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పటంతో ముందు లారీని మరోలారీ ఢికొట్టింది. దీంతో రెండు లారీలు రోడ్డుపై నుంచి డివైడర్ ఎక్కేశాయి.
ఆ సమయంలో రోడ్డును క్రాస్ చేసి డివైడర్ దాటేందుకు అటువైపుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి రెండు లారీల మధ్యా చిక్కుకుపోయాడు.కానీ అదృష్టం కొద్దీ సదరు వ్యక్తి ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా కనీసం గాయాలు కూడా కాకుండా అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీంతో అతను సురక్షితంగా ప్రాణాలతో బైటపడ్డాడు.