తండ్రిని చంపేసిన బాలుడు.. క్రైం సీరియల్స్ 100సార్లు చూసి సేఫ్ అవ్వాలని

UP Boy Killed Father: క్రైమ్ షోలను చూసి ఇన్‌స్పైర్ అయిన బాలుడు తండ్రినే చంపేశాడు. డెడ్ బాడీని నాశనం చేసి సాక్ష్యాన్ని మాయం చేసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
‘మనోజ్ మిశ్రా అనే వ్యక్తికి చాలా కోపం. మే2న కూతుర్ని కొడుతుండటం చూసి వెళ్లి కొడుకును కొట్టాడు. ఆవేశంతో తిరగబడ్డ బాలుడు ఐరన్ రాడ్‌తో ్డ్రదాడి చేసి తండ్రిని తలపై కొట్టి చంపేశాడు. స్పృహ కోల్పోయి పడిపోగానే చనిపోయినట్లు నిర్థారించుకున్నాడు. డెడ్ బాడీపై వేలిముద్రలు ఉండకుండా ఓ గుడ్డ ముక్కతో తుడిచేశాడు’
‘ఆ తర్వాత తల్లి సంగీత మిశ్రా సాయంతో స్కూటీపై శవాన్ని వైష్ణో ధాంకు తీసుకెళ్లి కాల్చేశారు’ అని మధుర ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత దానిని సూసైడ్ లా చిత్రీకరించాలనుకున్నాడు. కళ్లజోడు, చెప్పులు వంటివి దానికి అనుగుణంగా శవం పక్కన అమర్చాడు.
‘కనిపించకుండాపోయిన వ్యక్తి గురించి మే31వరకూ ఆ కుటుంబం ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు. దీంతో ముఖ్యమైన సాక్ష్యాలు అన్నీ మాయం చేసేశారు. వైష్ణో ధాం వెనుకవైపున గుర్తు తెలియని మృతదేహం లభించిన తర్వాత అనుమానం మొదలైంది. కళ్లజోడు ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు పోలీసులు.
మైనర్‌ను, అతని తల్లిని నెలల పాటు ప్రశ్నించిన పోలీసులు చివరకు ఆ బాలుడి ఫోన్ ను చెక్ చేశారు. అతను క్రైమ్ సీరియల్ లో వీడియోలు 100సార్లు చూసి చూశాడు. ప్లాన్ ప్రకారం.. ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడు. పలు మార్లు విచారణ జరుపుతుంటే ఆ మహిళ ఆమె కొడుకు ఏడవడం మొదలుపెట్టేవారు.
సాక్ష్యాలు నాశనం చేయడంతో పాటు హత్య చేసినట్లుగా పరిగణించి ఇద్దరినీ అరెస్ట్ చేశామని పోలీస్ అధికారి వెల్లడించారు.