తెలుగు భాష ఉండాలి అంటే ఇతర భాషలు వద్దని కాదు : వెంకయ్యనాయుడు

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 10:07 AM IST
తెలుగు భాష ఉండాలి అంటే ఇతర భాషలు వద్దని కాదు : వెంకయ్యనాయుడు

Updated On : December 25, 2019 / 10:07 AM IST

మాతృభాషపై ప్రేమను పెంచుకోవటం అంటే ఇతర భాషల్ని నేర్చుకోవద్దని కాదని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలనీ..గమనించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెలుగువారంతా తెలుగు భాషను కాపాడుకోవాలని..తెలుగు పద్యం అనేది మనకు తరతరాలుగా మానకు సంక్రమించిన అపురూపమైన ఆస్తి అని దాన్ని కాపాడుకోవాలనీ..పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువారికీ ఉందని ఆయన సూచించారు. తెలుగు సంస్కృతికి, తెలుగు పద్యానికి విడదీయరాని బంధం, అనుబంధం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనదీ, మధురమైనదీ, సుందరమైనదీ మరే భాషలో లేదనడం  అతిశయోక్తి  కాదు. తెలుగు పద్యం తరతరాలుగా ఎవరూ వీలునామా రాయనవసరం లేకుండానే మనకు సంక్రమించిన పెద్దల ఆస్తి అని కొనియాడారు. తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనదీ, మధురమైనదీ, సుందరమైనదీ మరే భాషలో లేదనడం  అతిశయోక్తి  కాదు. తెలుగు పద్యం తరతరాలుగా ఎవరూ వీలునామా రాయనవసరం లేకుండానే మనకు సంక్రమించిన పెద్దల ఆస్తి అని అన్నారు.  

తెలుగు భాషకే ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని తెచ్చిన అద్భుతమైన ప్రక్రియ తెలుగు పద్యం. మన నిత్యజీవితంలో, శ్రమలో, కష్టంలో, బాల్యపు లాలిత్యంలో మన అనుబంధాల్లో ఉన్న లయ తెలుగు పద్యంలో ఉన్నదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు భాషను కొనియాడారు.