విశాఖకు బాబు : ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత

విశాఖపట్టణానికి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును వారు ఆక్షేపించారు.
జిల్లాల విస్తృతస్థాయి సమావేశాలు టీడీపీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 10వ తేదీ గురువారం విశాఖకు బాబు వచ్చారు. బాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ లీడర్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు ఎన్ఏడీ వద్ద ఆపివేశారు. ర్యాలీకి అనుమతి లేదని..ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని పోలీసులు చెప్పారు. దీనికి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతి లేకపోతే..అక్కడనే ఆపవచ్చు కదా ? ఎయిర్ పోర్టు దగ్గర ఎందుకు ఆపారంటూ ప్రశ్నలు కురిపించారు.
తమ పార్టీ నాయకుడికి స్వాగతం పలికే స్వేచ్చ లేదా ? అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తూ ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని తాళ్ల సహయంతో అడ్డుకున్నారు. దీంతో నేతలు రోడ్డుపైనే కూర్చొన్నారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో కొన్ని బైక్స్ మాత్రమే అనుమతినిచ్చారు పోలీసులు. అనంతరం విమానాశ్రాయానికి చేరుకున్న బాబుకు ఘన స్వాగతం పలికారు.
Read More : 10 లక్షలు దాటితే రివర్స్ టెండరింగ్