ట్రెండ్ సెట్టర్ : హామీలు బాండ్ పేపర్ పై రాసిస్తా

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 08:59 AM IST
ట్రెండ్ సెట్టర్ : హామీలు బాండ్ పేపర్ పై రాసిస్తా

Updated On : March 28, 2019 / 8:59 AM IST

ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇంత సాహసం చేయలేదు.. ఏ పార్టీ ఇంతలా కసితో హామీ ఇవ్వలేదు.. బహుశా రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్టర్ ఇదే కావొచ్చు. దానికి ఆద్యులుగా జనసేన లీడర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిలవనున్నారు. కారణం.. పార్టీ తరపున విశాఖ లోక్ సభ బరిలో దిగిన ఆయన.. ఇచ్చిన హామీలను బాండ్ పేపర్ పై రాసి ఇచ్చారు. మానిఫెస్టోలో ఉన్న వాగ్ధానాలను అమలు చేయకుంటే.. ప్రజలు నన్ను కోర్టుకు లాగొచ్చు అని స్పష్టంగా చెప్పారు. మేనిఫెస్టోను అమలు చేసే ఆ దమ్ము ఉంది మాకు (జనసేన పార్టీకి)ఉంది అంటూ లక్ష్మీనారాయణ ధీమాగా చెబుతున్నారు.

రాజకీయాల్లోకి అడుగు పెట్టిన లక్ష్మీనారాయణ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తనదైన స్టయిల్ లో వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విశాఖవాసుల మనసు గెలచుకునేందుకు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. విశాఖకు స్పెషల్ మేనిఫెస్టో అంటూ సంచలన ప్రకటన చేశారు. స్థానిక సమస్యలు – పరిష్కారాలు – హామీలు ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలకు బాండ్ పేపర్ ఇస్తున్నారు. మరి ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి..