వైసీపీ ఎమ్మెల్యే సూసైడ్ సెల్ఫీ వీడియో

చిత్తూరు: పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ బెదిరిస్తూ ఈవీడియోలో సునీల్ చెప్పారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ సునీల్ ను కలిసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనవ సునీల్ వైసీపీ కార్యకర్తగానే చనిపోతానంటూ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. టీడీపీ నేతలకు అమ్ముడుపోయానని తనపై కొందరు దుష్ప్రచారం చేశారని, తనపై జగన్ కు చాడీలు చెప్పారని, అది తనకు తీవ్ర మనోవేదనను కలిగించిందని వీడియోలో చెప్పుకొచ్చారు. జగన్ తననెపుడూ గౌరవంగానే చూశారని , నేను ఏ లోకంలో ఉన్నా జగన్ బాగుండాలని సునీల్ వీడియోలో కోరారు.