బాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 08:21 AM IST
బాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్

Updated On : March 27, 2019 / 8:21 AM IST

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. బాబు మరోసారి అధికారంలోకి వస్తే తీవ్రమైన సమస్యలు ఏర్పడుతాయని వెల్లడించారు. బాబు ప్రకటించిన పథకాలు రద్దవుతాయని, 1994లో బాబు ఎలాంటి హామీలు ఇచ్చారో..ఆ హామీలు ఏమయ్యాయో గుర్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు జగన్. ఒక 20 రోజులు ఓపిక పడితే వైసీపీ అధికారంలోకి వస్తుందని.. సమస్యలు తీరుతాయని ప్రతొక్కరికి చెప్పాలని ప్రజలను కోరారు 
Read Also : జగన్ కూడా రెడీ.. కేసీఆర్‌ను ఢిల్లీకి పంపిద్దాం : కేటీఆర్

బాబు అధికారంలోకి వస్తే పలు పథకాలు, కార్యక్రమాలు రద్దు చేస్తారని జగన్ వెల్లడించారు. మార్చి 27వ తేదీ బుధవారం పాయకరావుపేటలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో గెలుపొందేందుకు బాబు ప్రతి గ్రామానికి డబ్బుల సంచులు పంపిస్తాడని ఒక్కో ఓటర్‌కు రూ. 3వేలు పంచే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే  ఎలాంటి పనులు చేస్తామో ప్రకటించారు. పలు సంక్షేమ పథకాలతో రైతులను, డ్వాక్రా సంఘాల వారిని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని జగన్ హామీనిచ్చారు. 

మళ్లీ బాబు సీఎం అయితే..
* డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచుతాడు.
* బ్యాంకుల నుండి వచ్చే రుణాలు రైతులకు ఇవ్వడు. 
* రైతులకు సబ్సిడీలను తొలగిస్తారు. 
* మళ్లీ అధికారంలోకి భూములు ఇళ్లు లాక్కొంటారు.
* బాబు చెప్పిన పథకాలు అన్నింటినీ రద్దు చేస్తాడు. 
* రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. 
* ఆరోగ్య శ్రీ పూర్తిగా రద్దు చేస్తారు. 
* 108, 104 ఏవీ ఉండవు.
* రూ. 40 వేలు ఉన్న లారీ ఇసుక రూ. లక్ష అవుతుంది. 
* కాలేజీల ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిగా రద్దు చేస్తారు. 
* పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. 
* వ్యతిరేకించే వారిని బాబు వదిలిపెట్టడు. 
* బాబు..ఆయన మనుషులు ఎలాంటి నేరం చేసినా పత్రికలు, టీవీల్లో వార్తలు రావు. 
* రాష్ట్రంలో పరిపాలన అనేది ఉండదు. 
* రేషన్ కార్డులను, పెన్షన్లు తొలగిస్తారు.
బాబు చూపిస్తున్న డ్రామాలు నమ్మొద్దు.
రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి గెలుపొందిన బాబు..ఎన్నికలు అయిపోగానే వెన్నుపొటుపొడిచి సీఎం అయ్యారని, అనంతరం రేట్లు పెంచేశాడని గుర్తు చేశారు జగన్. 
Read Also : వైసీపీ ఫోన్లు ట్యాపింగ్: హైకోర్టులో విచారణ ప్రారంభం