వాటెన్ ఐడీయా : యువ రైతు ఆలోచన.. పంటను కాపాడింది

నిజామాబాద్ జిల్లాలో ఓ యువ రైతుకు వచ్చిన ఆలోచనలో తన పంటను కాపాడుకున్నాడు.

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 04:51 AM IST
వాటెన్ ఐడీయా : యువ రైతు ఆలోచన.. పంటను కాపాడింది

Updated On : February 19, 2019 / 4:51 AM IST

నిజామాబాద్ జిల్లాలో ఓ యువ రైతుకు వచ్చిన ఆలోచనలో తన పంటను కాపాడుకున్నాడు.

నిజామాబాద్‌ : ఆలోచన చేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. ఒక యువ రైతుకు వచ్చిన ఆలోచన అతని సమస్యను తీర్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న చేతికి వచ్చే సమయంలో అడవి పందులు, పక్షులు దాడి చేసి నాశనం చేస్తున్నాయి. పంటను రక్షించుకోవడానికి రాత్రంతా పొలం వద్దనే కాపాలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కష్టమొచ్చింది కాదా అని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. వాటి బెడద నుంచి పంటను కాపాడటానికి ఓ యువ రైతు ఒక ఉపాయం చేశాడు. అతనికి వచ్చిన ఆలోచనను అమలు చేశాడు. పంటను కాపాడుకున్నాడు. 

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం సిర్పూర్‌ గ్రామానికి చెందిన యువ రైతు శ్రవణ్‌. తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో అడవి పందులు తినేస్తున్నాయి. దీంతో ఇంట్లో పాడైపోయిన ఫ్యాన్‌ను రిపేర్‌ చేయించి రెక్కలు తీసేసి.. దానికి రెండు సైకిల్‌ చైన్‌లు, స్టీలు బిందె, ప్లేటు, కుక్కర్‌ను కట్టాడు. ఫ్యాన్‌ ఆన్‌ చేయగానే అది తిరుగుతూ పెద్ద శబ్దాలు వస్తాయి. వీటితో పాటు పొలంలో డిస్కో లైట్లను సైతం అమర్చాడు. రాత్రి సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు, రంగు రంగుల డిస్కో లైట్లు వెలగడంతో అడవి పందులు పొలం వైపు రావడం లేదు. ఉదయం సమయంలో శబ్దాలు రావడంతో పక్షులు సైతం ఆ పరిసరాల్లో కనిపించడం లేదు. ఇలా తక్కువ ఖర్చుతో తన పంటను రక్షించుకుంటున్నానని శ్రవణ్‌ చెప్పాడు.