జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత

కడప: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం (మార్చి 15) తెల్లవారుజామున పులివెందులలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వివేకానందరెడ్డి మృతి జగన్ ఫ్యామిలీని, వైసీపీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా కనిపించిన ఆయన.. సడెన్ గా మృతి చెందడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర రాజకీయ అంశాల్లో చురుగ్గా కనిపించిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయారు అంటే ఎవరూ విశ్వసించడం లేదు.
Read Also: బాత్రూంలో ఏం జరిగింది : వివేకానందరెడ్డి మృతిలో 5 అనుమానాలు
1950 ఆగస్టు 8న వివేకా పులివెందులలో జన్మించారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు. అన్ని విషయాల్లో అన్నకు చేదోడు వాదోడుగా నిలిచారు. అలాంటి వ్యక్తి మరణం జగన్ కుటుంబానికి తీరని లోటుగా చెప్పొచ్చు. కడప నుంచి లోక్ సభకు వివేకా ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లో కడప లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు.
Read Also: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు