బాబు భవిష్యత్ ఇచ్చాడా ? – నా బిడ్డ రౌడీ కాదు – విజయమ్మ

నా బిడ్డ రౌడీ కాదు..రౌడీయిజం చేయలేదు..గూండాయిజం చేయలేదు..మీరే రౌడీలు..అంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. మీ భవిష్యత్తు నా భద్రత అంటున్న చంద్రబాబు.. ఎవరికి భద్రత ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్ముళ్లూ, చెల్లెమ్మలు నన్ను రక్షించండని వేడుకుంటున్న బాబుకే భద్రత లేదు, ఆయన రాష్ట్ర ప్రజలకు ఏమీ భద్రత కల్పిస్తారని నిలదీశారు.
చంద్రబాబు మాదిరిగా ఏనాడైన జగన్ కాపాడమని రాష్ట్ర ప్రజలను అడిగారా ? ఆయన కష్టం..బాధలు ఎప్పుడైనా చెప్పారా ? అని ప్రజలను అడిగారు. ఏప్రిల్ 07వ తేదీన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయమ్మ చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేశారు. వైసీపీకి ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు విజయమ్మ. నాలుగున్నరేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని, తల్లి కాంగ్రెస్, వైసీపీ పిల్ల కాంగ్రెస్ అన్న బాబు.. ఇప్పుడు బీజేపీ, టీఆర్‌ఎస్‌తో వైసీపీకి సంబంధముందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడు..బీజేపీతో జగన్ లేడని..అలాగే కాంగ్రెస్‌తో జతకట్టలేదని..కేసీఆర్‌తో సంబంధం లేదని చెప్పిన విజయమ్మ..ఒంటరిగానే జగన్ పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.