మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్న పిల్లాడు..వీడియో

ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఓ బుడతడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమాత్రం దర్పం లేకుండా ప్రజల్లో చక్కగా కలిసిపోతుంటారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ ప్రజల్ని కలుస్తు..వారిని పలకరిస్తూ వస్తున్న ఆమెను ఓ స్కూల్ విద్యార్థి బుగ్గగిల్లాడు. బుగ్గ గిల్లి ముద్దు కూడా ఇచ్చాడు.
సడెన్ గా జరిగిన ఈ పరిణామానికి ఎమ్మెల్యే రజని ఒకొంత షాక్ అయ్యారు. తరువాత చక్కగా నవ్వేశారు. ఆ తర్వాత సర్ ప్రైజ్‌గా ఫీలయ్యారు. ఈ పిల్లాడు చేసిన పనికి అక్కడున్న వాళ్లంతా సరదాగా నవ్వుకున్నారు. ఆ పిల్లాడు ఎంతో అప్యాయంగా ఎమ్మెల్యేకు ముద్దిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ కూడా ఈ చిన్నపిల్లాడు చేసిన పని సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా చూసేయండి ఆ వీడియోను..సరదాగా నవ్వేసుకోండి.
YSRCP MLA Vidadala Rajini from Chilkaluripet in Andhra Pradesh taken by surprise and laughs as a boy shows some affection on her. pic.twitter.com/xfUOGu45wl
— Sushil Rao (@sushilrTOI) November 25, 2019