అక్టోబర్‌ 10 నుంచి కంటి వెలుగు : షెడ్యూల్‌ విడుదల

ఏపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని (అక్టోబర్‌ 10, 2019) లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ పథకాన్ని... 2022 వరకు కొనసాగించనున్నారు.

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 02:42 PM IST
అక్టోబర్‌ 10 నుంచి కంటి వెలుగు : షెడ్యూల్‌ విడుదల

Updated On : September 21, 2019 / 2:42 PM IST

ఏపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని (అక్టోబర్‌ 10, 2019) లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ పథకాన్ని… 2022 వరకు కొనసాగించనున్నారు.

ఏపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని (అక్టోబర్‌ 10, 2019) లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ పథకాన్ని… 2022 వరకు కొనసాగించనున్నారు. వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం కింద రాష్ట్ర  ప్రజలను స్ర్కీనింగ్‌ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం 5వందల 60కోట్ల 89 లక్షలు కేటాయించింది. వైద్య పరికరాలు, మందులు, కళ్లజోళ్లను కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌కు అప్పగించారు. 

ఈ కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు. దశల వారీ కార్యక్రమంలో భాగంగా తొలిదశలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా పిహెచ్‌సి, సిహెచ్‌సిలలో దాదాపు 800 స్క్రీనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందకు వైద్యఆరోగ్య శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. స్క్రీనింగ్‌ పరీక్షలకు స్థానిక ఉపాధ్యాయులు, ఆశా వర్కర్ల సహకారం తీసుకోనున్నారు. ప్రారంభంలో సిహెచ్‌సి, జిల్లా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న రెగ్యులర్‌ కంటివైద్యులు భాగస్వాములు కానున్నారు. అనంతరం పూర్తిస్థాయిలో కార్యక్రమం అమలుకు సుమారు 400 మంది కంటి వైద్య నిపుణులను నియమించనున్నారు. 

తొలివిడత స్క్రీనింగ్‌ పరీక్షలు విద్యార్థులకు నిర్వహించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వారికి స్క్రీనింగ్‌, కళ్లద్దాల పంపిణీ పూర్తిచేయనున్నారు. అనంతరం కమ్యూనిటీ స్థాయిలో ఇంటింటికీ సర్వే తరహాలో అందరికీ స్క్రీనింగ్‌ నిర్వహించి ఆ తర్వాతి ఏడాది నాటికి వారికి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌, శంకర కంటి ఆస్పత్రి వంటి పలు సంస్థలు, ఎన్జీఓలు కూడా భాగస్వాములు అయ్యేందుకు ముందుకొస్తున్నట్లు తెలిసింది. స్క్రీనింగ్‌తోపాటు అవసరమైతే శుక్లాల ( కాటరాక్ట్‌ ) ఆపరేషన్లు కూడా చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. అవసరమయ్యే వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు ఎపి వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌ త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది.