కంగ్రాట్స్ : దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు

  • Published By: madhu ,Published On : October 31, 2019 / 09:41 AM IST
కంగ్రాట్స్ : దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు

Updated On : October 31, 2019 / 9:41 AM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసిన దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం వ్యవశాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. 

YSR లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా ఒక సామాన్యుడు..అసమాన్య పనిని పూర్తి చేసిన దర్మాడికి అవార్డు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బోటు వెలికి తీసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది నిపుణులు వచ్చి చేతులేత్తేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో తాము బోటు తీస్తామని దర్మాడీ టీం పక్కాగా చెప్పిందని, ఖర్చుకు వెనుకాడవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు.

కాకినాడకు చెందిన దర్మాడి సత్యం ఎంతో శ్రమించి బోటు వెలికి తీశారని తెలిపారు. ఒక మత్స్యకారుడు దర్మాడి ఎంతో శ్రమించి బోటును వెలికి తీసినందుకు అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

అవార్డు వచ్చిన దర్మాడితో 10tv మాట్లాడింది. చాలా ఆనందంగా ఉందన్నారు. తమ మిత్రబృందంతో కలిసి బోటు వెలికితీయడం జరిగిందన్నారు. తనకు ప్రభుత్వం అవార్డు అందచేసిందని గొప్పగా చెప్పుకుంటానని తెలిపారు. తనకు అవార్డు వచ్చిన విషయం మొదట 10tv చెప్పిందన్నారు దర్మాడి. 
Read More : చెప్పాల్సింది చెప్పాం : బంతి వంశీ కోర్టులో : ఎంపీ కేశినేని