బీసీలకు పెద్ద పీట – జగన్

  • Published By: madhu ,Published On : March 17, 2019 / 05:31 AM IST
బీసీలకు పెద్ద పీట – జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్ సభ స్థానాలకుగాను పెండింగ్ లో ఉన్న 16 సీట్లకూ అభ్యర్థులను ప్రకటించారు. లిస్టు ప్రకటించిన అనంతరం జగన్ మాట్లాడుతూ…
బీసీలకు 41 సీట్లు ఇచ్చినట్లు, బీసీల జాబితా పెంచేసినట్లుగా బాబు చూపిస్తున్నారని విమర్శించారు. ఆయనలాగా కలుపుకొంటే బీసీలకు తాము ఇచ్చిన సంఖ్య 45 దాక చేరుతుందన్నారు. గతంలో ఇచ్చిన దానికంటే ముస్లీం సోదరులకు ఒక సీటు ఎక్కువగా..అంటే 5 సీట్లు ఇచ్చామన్నారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించలేదన్నారు. ప్రజాభిప్రాయం, సర్వేల ప్రకారం టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుందనే దానిపై నిర్ణయం తీసుకుని ఫైనల్ చేశామన్నారు జగన్. అంతకు ముందు అభ్యర్థుల జాబితాను పట్టుకున్న జగన్…తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు.