జగన్ హామీ : ఏపీలోనూ రైతు బంధు

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 12:40 PM IST
జగన్ హామీ : ఏపీలోనూ రైతు బంధు

శ్రీకాకుళం : ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. మొత్తం 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. 2019, జనవరి 9వ తేదీ బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసింది. వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో జగన్ మాట్లాడారు. అధికారంలోకి వస్తే ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడతామన్నారు. రైతులపై వరాల జల్లు కురిపించారు.

అన్నదాతలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తరహాలో రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రకటించారు. అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. రైతులకు పెట్టుబడి కష్టాలను తీర్చడానికి ఏటా మే లో పెట్టుబడి సాయం అందిస్తామని, రైతులందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఇన్సూరెన్స్ చేయిస్తామని వాగ్దానం ఇచ్చారు.

* రైతుబంధు తరహాలో ఏపీ రైతులకు రైతు పెట్టుబడి పేరుతో మే నెలలో రూ.12,500 పెట్టుబడి సాయం
* రైతు బీమా తరహాలో వైఎస్ఆర్ బీమా.. రైతు మరణిస్తే రూ. 5 లక్షల ఆర్థిక సాయం.. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది
* రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయం
* మండలానికి ఒక శీతల గిడ్డంగి, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
* రైతులకు ఉచిత బోర్లు
* రైతులకు రోజుకు 9 గంటల పాటు ఉచిత కరెంటు
* రైతులకు వడ్డీ లేని రుణాలు
* ప్రతి గ్రామంలో పది మందికి గ్రామ పంచాయతీలో ఉద్యోగాలు
* రైతులకు పగటిపూట 9గంటల ఉచిత కరెంటు.
* ప్రతి రైతుకు వడ్డీ లేకుండా రుణాలు.
* రైతులకు ఏడాదికి రూ. 12 వేల 500 పెట్టుబడి.
* రైతుల సాగు ఖర్చుల తగ్గింపు, పెట్టుబడి సాయం.
* రైతులకు ఉచితంగా బోర్లు.
* రైతులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది.
* బీమా సొమ్మును రైతు కుటుంబాలకు చేర్చే బాధ్యత సర్కార్‌దే.
* రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
* పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయిస్తాం.
* ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు.
* ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు.
* సహకార డైరీలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ. 4 బోనస్.
* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు.
* రూ. 4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు.
* ఇందులో రూ. 2వేల కోట్లు రాష్ట్రం వాటా. మరో 2వేల కోట్లు కేంద్రం వాటా.
* తిత్లీ తుపాన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు ప్రతి చెట్టుకు రూ. 3వేలు.
* జీడి చెట్టుకు రూ. 50వేలు.
* రైతు ప్రమాదవశాత్తు చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా వైఎస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు.
* ప్రతి ప్రాజెక్టునూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి