అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ పోటీ.. ఇదే చివరిసారి.. ఎలాగంటే?

అమెరికా అధ్యక్ష పదవికి ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసిన ట్రంప్.. ఓ సారి గెలిచారు.

అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ పోటీ.. ఇదే చివరిసారి.. ఎలాగంటే?

Donald Trump

Updated On : September 23, 2024 / 7:02 PM IST

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే 2028లో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశానికి ఎవరైనా రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేస్తే వారికి మూడోసారి పోటీ చేసే అవకాశం ఉండదు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో గెలిచినా 2028లో పోటీ చేసే అవకాశం లేదు. గెలవకపోయినా తాను పోటీ చేయనని ట్రంప్ ప్రకటించడంతో అమెరికా అధ్యక్ష పదవికి ఆయన పోటీ పడడం ఇదే చివరిసారి అవుతుంది.

అమెరికా అధ్యక్ష పదవికి ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసిన ట్రంప్.. ఓ సారి గెలిచారు. ఇప్పుడు ఆయన మూడోసారి పోటీ చేస్తున్నారు. కమలా హ్యారిస్ డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తుండగా, ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతుండగా ఆయనను జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేస్తారా? అని అన్నారు. దానికి ట్రంప్ స్పందిస్తూ.. ‘మళ్లీ పోటీ చేయాలని నేను అనుకోవడం లేదు’ అని అన్నారు. అయితే, తాము ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉందని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్నాయి.

PM Modi : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్