Viral Video: నవ్వులు పూయిస్తున్న పాకిస్తాన్ కుకింగ్ షో ఆడిషన్స్ వీడియో.. ఇంతకీ ఏం జరిగిందంటే
కుకింగ్ షో కోసం పోటీదారులను ఎంపిక చేస్తున్న నిర్వాహకులకు షాకిచ్చిందో మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్‌లో ‘ద కిచెన్ మాస్టర్’ పేరుతో ఒక టీవీ కుకింగ్ షో రాబోతుంది. ఈ షో కోసం నిర్వాహకులు పోటీదారుల్ని ఎంపిక చేస్తున్నారు. షోలో పాల్గొనాలి అనుకునే వాళ్లు తాము సొంతంగా చేసిన వంటల్ని తీసుకొచ్చి, నిర్వాహకుల్ని మెప్పిస్తున్నారు.

Viral Video: టీవీల్లో ప్రసారమయ్యే కుకింగ్ షోలని చూసే ఉంటారు. అద్భుతంగా వంట చేయగలిగిన కొందరిని ఎంపిక చేసి, వారి మధ్య పోటీ పెడతారు. ఈ పోటీల్లో గెలిచిన వారిని విజేతగా ఎంపిక చేస్తారు. అసలు ఈ షోలో పాల్గొనాలంటేనే ముందుగా నిర్వాహకులకు తమ చేతి వంట రుచి చూపించాలి.
సొంతంగా చేసిన ఏదైనా వంటను నిర్వాహకులు మెచ్చేలా చేస్తే, వారిని పోటీకి ఎంపిక చేస్తారు. దీంతో పోటీలో పాల్గొనాలి అనుకునే ఎవరైనా సొంతంగా ఏదో ఒకటి వండుకుని వస్తారు. కానీ, పాకిస్తాన్ కుకింగ్ షోలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. కుకింగ్ షో కోసం పోటీదారులను ఎంపిక చేస్తున్న నిర్వాహకులకు షాకిచ్చిందో మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్‌లో ‘ద కిచెన్ మాస్టర్’ పేరుతో ఒక టీవీ కుకింగ్ షో రాబోతుంది. ఈ షో కోసం నిర్వాహకులు పోటీదారుల్ని ఎంపిక చేస్తున్నారు. షోలో పాల్గొనాలి అనుకునే వాళ్లు తాము సొంతంగా చేసిన వంటల్ని తీసుకొచ్చి, నిర్వాహకుల్ని మెప్పిస్తున్నారు.
Manish Sisodia: సీబీఐ లాకప్‌లో మనీశ్ సిసోడియాకున్న సదుపాయాలేంటో తెలుసా?
వారిలో బాగా చేసిన వారిని షో కోసం ఎంపిక చేస్తున్నారు. అందరూ తాము బాగా చేయగలిగిన వంటల్ని తీసుకొచ్చారు. కానీ, ఒక మహిళ మాత్రం హోటల్ నుంచి బిర్యానీ పార్శిల్ తీసుకొచ్చింది. ఆ బిర్యానీ టేస్ట్ చేసి.. ఎలా ఉందో చెప్పి.. తనను షో కోసం ఎంపిక చేయాలని కోరింది. ఇది విన్న నిర్వాహకులు షాకయ్యారు. హోటల్ నుంచి బిర్యానీ తేవడమేంటని నవ్వుకున్నారు. ఇది కుకింగ్ షో అని, సొంతంగా చేసుకొచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అయినా ఆమె వినలేదు. తాను చాలా కష్టపడి, క్యూలో నిలబడి మరీ బిర్యానీ తెచ్చానని, ఒకసారి ఆ బిర్యానీ టేస్ట్ చేయాలని కోరింది. దీంతో నిర్వాహకులు మరింత షాకయ్యారు.
అలా కుదరదని చెప్పారు. ఆమె వినిపించుకోకుండా మళ్లీ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. దీంతో నిర్వాహకులు ఆమెను బయటకు వెళ్లమని, టైం వేస్ట్ చేయొద్దని సూచించారు. దీనికి సంబంధించి వీడియో క్లిప్ పాకిస్తాన్‌లోనే కాదు.. ఇప్పుడు ఇండియాలో కూడా వైరల్ అవుతోంది. కుకింగ్ షో అంటేనే తమ కుకింగ్ స్కిల్స్ చూపించడం. అలాంటిది హోటల్ నుంచి తెచ్చిన ఫుడ్ తీసుకుని, తనను సెలక్ట్ చేయమని అడిగిన ఆమె కాన్ఫిడెంట్ మాత్రం వేరే లెవల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Pakistan Masterchef is another level ???? pic.twitter.com/A46vY7iWSZ
— Nandita Iyer (@saffrontrail) February 27, 2023