Dunzo Agent Run Behind Train: నువ్వు గ్రేట్ సామి..! రైలు వెంట పరుగెత్తి కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేసిన డన్జో ఏజెంట్.. వీడియో వైరల్ ..

సోషల్ మీడియాలో మనస్సును కదిలించే వీడియోలు, నవ్వులు పూయించే వీడియోలకు కొదవలేదు. రోజు ఏదో విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Dunzo Agent Run Behind Train: నువ్వు గ్రేట్ సామి..! రైలు వెంట పరుగెత్తి కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేసిన డన్జో ఏజెంట్.. వీడియో వైరల్ ..

Dunzo agent runs behind train

Updated On : September 15, 2022 / 7:45 PM IST

Dunzo Agent Run Behind Train: సోషల్ మీడియాలో మనస్సును కదిలించే వీడియోలు, నవ్వులు పూయించే వీడియోలకు కొదవలేదు. రోజు ఏదో విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ డన్జో ఏజెంట్ రైలు వెంట పరుగెత్తి మరీ తన కస్టమర్ కు ఆర్డర్ చేసిన వస్తువులను అందించాడు. అది అందుకున్న వ్యక్తి డన్జో ఏజెంట్ ఇచ్చిన బ్యాగ్ ను చూపుతూ సంతోషం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే నాలుగు లక్షల మందికిపైగా వీక్షించారు. పలువురు నెటిజన్లు డన్జో ఏజెంట్ తన వృత్తిపట్ల చూపిన అంకితభావానికి ఫిదా అవుతూ అభినందిస్తున్నారు.

Traffic Control: ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో ఈ హోంగార్డ్ స్టైలే వేరు.. వీడియో చూస్తే మీరూ ఫిదా అవుతారు..

ముంబైకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో డన్జో డెలివరీ బాయ్ స్టేషన్ లో పరుగెత్తుకుంటూ కనిపిస్తాడు. అతని చేతిలో ఓ సంచి ఉంది. ఆ సంచిని రైల్లో వెళ్తున్న వ్యక్తికి అందించడంలో విజయవంతం అయ్యాడు. రైల్వే ఫ్లాట్‌ఫాంలో రైలు నెమ్మదిగా వెళ్తుంది. క్రమంగా రైలు వేగంగా కదులుతోంది. ఇంతలోనే డన్జో డెలివరీ బాయ్ ఓ సంచితో పరుగెత్తకుంటూ ప్లాట్ ఫాంపైకి వచ్చాడు.. రైలులో డోర్‌లో నిలబడిన ఓ మహిళ .. డన్జో బాయ్‌ను వేగంగా రా అంటూ చేతులతో సైగలు చేస్తూ వీడియోలో కనిపించింది. డన్జో బాయ్ రైలు వెంట వేగంగా పరుగెత్తకుంటూ వెళ్లి తన చేతిలోని సంచిని ఆ మహిళకు అందించాడు. ఆమె దానిని చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తుండటం వీడియోలో చూడొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తి.. పుష్పా ఝుకేగా నహీ, డుంజో రుకేగా నహీ,”అంటూ శీర్షిక ఇచ్చాడు.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డన్జో ఏజెంట్ తన వృత్తిపట్ల చూపిన అంకితభావాన్ని మెచ్చుకుంటున్నారు.