Viral Video : OMG.. తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్న చిన్నారి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Viral Video : అకస్మాత్తుగా జరిగిన ఘటనతో భయపడిపోయిన బాలిక.. ఇంట్లోకి పరుగులు తీసింది. అలా పాము కాటు నుంచి చిన్నారి తప్పించుకోగలిగింది.

Viral Video : OMG.. తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్న చిన్నారి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Viral Video (Photo : Google)

Updated On : June 2, 2023 / 12:06 AM IST

Karnataka – Snake Bite : కర్నాటక బెళగావిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక తృటిలో పాము కాటు నుంచి తప్పించుకుంది. రెప్పపాటులో పెద్ద అపాయం నుంచి సురక్షితంగా బయటపడింది. లేదంటే, ఘోరం జరిగిపోయి ఉండేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హల్గా జిల్లాలోని సుహాస్ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి ఓ పాప ఉంది. అప్పటివరకు ఆడుకున్న బాలిక, ఇంట్లోకి వెళ్లేందుకు వచ్చింది. తన ఇంటిలోకి వెళ్లబోయింది. అయితే గుమ్మం దగ్గరే ఓ పాము ఉంది. బాలిక ఆ పామును గమనించలేదు. అలానే వచ్చేసింది. ఇంతలో పాము చిన్నారిని కాటు వేసేందుకు ప్రయత్నించింది.

Also Read..Chinese Influencer : నాన్‌స్టాప్‌గా 4 బాటిళ్ల మద్యం తాగేశాడు.. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది.. షాకింగ్ వీడియో

అయితే ఆ పాప పాము కాటు నుంచి తప్పించుకుంది. ఏదో శబ్దం కావడంతో అటుగా చూసింది. అంతే, ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. అక్కడ పెద్ద పాము కనిపించేసరికి పాప కంగారుపడింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో భయపడిపోయిన బాలిక.. ఇంట్లోకి పరుగులు తీసింది. అలా పాము కాటు నుంచి చిన్నారి తప్పించుకోగలిగింది. ఆ తర్వాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.