Bungee Jump : భార్యతో విడాకులు వచ్చిన ఆనందంలో ప్రాణాంతక సాహసం.. కట్ చేస్తే ఘోరం.. వీడియో వైరల్

Bungee Jump: ఏకంగా 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది. చావు అంచుల వరకు వెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Bungee Jump : భార్యతో విడాకులు వచ్చిన ఆనందంలో ప్రాణాంతక సాహసం.. కట్ చేస్తే ఘోరం.. వీడియో వైరల్

Bungee Jump(Photo : Google)

Updated On : May 6, 2023 / 7:53 PM IST

Bungee Jump : ఓ యువకుడికి తన భార్యతో విడాకులు మంజూరు అయ్యాయి. దాంతో అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ సంతోషంలో అతడు దుస్సాహసం చేశాడు. అయితే, అతడు ఒకటనుకుంటే విధి మరొకటి తలచింది. అతడు చేసిన దుస్సాహసం బెడిసికొట్టింది. అతడి కొంపముంచింది. ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్రంగా గాయపడేలా చేసింది. చావు అంచుల వరకు వెళ్లాల్సి వచ్చింది.

ఆ యువకుడి పేరు రాఫెల్ డాస్ సాంటోస్ టోస్తా. వయసు 22 ఏళ్లు. పెళ్లి కూడా అయ్యింది. అయితే, కొన్నాళ్లకే భార్యతో గొడవలు మొదలయ్యాయి. అంతే, మ్యాటర్ విడాకులకు వెళ్లింది. కోర్టుని ఆశ్రయించగా.. వారిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. దాంతో రాఫెల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించాడు. ఇందుకోసం అతడు సాహసం చేశాడు. బంగీ జంప్ ఎంచుకున్నాడు.

Also Read..Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం

ఏకంగా 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది. మధ్యలోనే తాడు తెగిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. రాఫెల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మెడ, చేతులు, కాళ్ల ఎముకలు విరిగాయి. అయితే, తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాఫెల్ ప్రాణాలతో బయటపడి కోలుకుంటున్నాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Ghaziabad Manhole : షాకింగ్ వీడియో.. అంతా చూస్తుండగానే, నడుస్తూ నడుస్తూ మ్యాన్ హోల్‌లో ఎలా పడిపోయారో చూడండి

ఆ యువకుడి తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. వీడెవడండీ బాబూ అని నెటిజన్లు తల పట్టుకుంటున్నారు. ఇదెక్కడి సెలబ్రేషన్ రా మామా? కాస్తలో ప్రాణాలే పోయి ఉండేవి కదా అని కామెంట్స్ చేస్తున్నారు. డివోర్స్ రావడంతో వేడుకలు చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇలా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు కదా అని మరికొందరు అంటున్నారు.