First Night Bride : శోభనం గదిలో వధువు ప్రశ్నకి బిత్తరపోయిన వరుడు

ఓ పెళ్లి వేడుకలో శోభనం గదిలోకి వచ్చిన పెళ్లికూతురు వేసిన ప్రశ్నకు వరుడు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు. వధువు అడిగిని ప్రశ్నకు అంతా తర్వాత నవ్వుకున్నారు లెండి....

First Night Bride : శోభనం గదిలో వధువు ప్రశ్నకి బిత్తరపోయిన వరుడు

First Night Bride

Updated On : July 31, 2021 / 3:52 PM IST

First Night Bride : శోభనం…. తెలుగు సినిమాల్లో ఈ శోభనం సీన్లు లెక్కలేనన్ని ఉంటాయి… శుభం కార్డు పడేముందు కానీ, కొంత స్టోరీ అయిపోయాక కానీ… అవకాశం ఉన్నచోట ఎక్కడో ఒకచోట ఈ సీన్ ఉంటుంది. ఇక మళయాళ బీగ్రేడ్ సినిమాల్లో చెప్పాలంటే…….. బాబోయ్….. సరే అవన్నీ వద్దులెండి. సాధారణంగా వివాహాం అయిన తర్వాత శోభనానికి ఒక ముహుర్తం ఫిక్స్ చేస్తారు ఆరోజు నూతన వధూవరులిద్దరినీ ఒకగదిలోకి పంపిస్తారు. ఇది పెళ్లైన ప్రతి జంటకు జరిగేదే.

తాజాగా ఓ పెళ్లి వేడుకలో శోభనం గదిలోకి వచ్చిన పెళ్లికూతురు వేసిన ప్రశ్నకు వరుడు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు. వధువు అడిగిని ప్రశ్నకు అంతా తర్వాత నవ్వుకున్నారు లెండి…. అది వేరే విషయం. అసలు ఏం జరిగిందటే… ఓ ఇంట్లో పెళ్లి జరిగింది. పెళ్లి వేడుక పూర్తయ్యింది. బంధువులంతా ఎవరింటికి వారు వెళ్లారు. ఆరాత్రికి జరగాల్సిన కార్యానికి పెద్దలు అంతా సిధ్ధం చేశారు. గదిని వివిధ రకాల పూలతో అలంకరించారు. వధువు వచ్చే లోపు వరుడు మంచం నిండా గులాబీ పూల రేకులతో కప్పేశాడు.

శోభనం గదిలోకి అడుగు పెట్టిన పెళ్ళి కూతురు అలంకరణ చూసి ఆనందంలో ఉబ్బితబ్బిబవుతూ ….‘‘సోయెంగే కహా పె( మనం ఎక్కడ నిద్రపోవాలి)’’ అని వరుడ్ని ప్రశ్నించింది. ఈ వీడియో దుల్హనియా అనే ఇన్‌స్టా‌గ్రాంలో పోస్ట్ చేయబడింది. దీనిపై కొందరు నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. ‘పడక గదిని పబ్లిక్‌ చేశారు’’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరికొందరు నవ్వుతూ ఎమోజీలతో కామెంట్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈవీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Dulhaniyaa.com-Indian Weddings (@dulhaniyaa)