Strange Video: వీడిన చైనా గొర్రెల మిస్టరీ.. గొర్రెలు అలా గుండ్రంగా ఎందుకు తిరిగాయంటే?

మొదట తక్కువ గొర్రెలు ఇలా ప్రవర్తించాయట. క్రమంగా వాటికి తోడుగా మరిన్ని గొర్రెలు చేరుతున్నాయని ఆ గొర్రెల యజమాని పేర్కొన్నాడు. అయితే ఆ గొర్రెలు లిస్టెరియోసిస్ అనే బాక్టీరియల్ వ్యాధి వల్ల అలా చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిని “సర్క్లింగ్ డిసీజ్” అని కూడా పిలుస్తారని వారు పేర్కొన్నారు.

Strange Video: వీడిన చైనా గొర్రెల మిస్టరీ.. గొర్రెలు అలా గుండ్రంగా ఎందుకు తిరిగాయంటే?

Scientist Claims Mystery Behind Sheep Walking In Circle In China Solved

Updated On : November 22, 2022 / 7:04 PM IST

Strange Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వృత్తాకారంలో తిరుగుతున్న గొర్రెల మిస్టరీ దాదాపుగా వీడినట్లే అనిపిస్తోంది. ఇవేవీ ఆ మూగజీవాల వింత ప్రవర్తనకు కారణం కాదని ఇంగ్లాండ్ హర్ట్ ప్యూరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మ్యాట్ బెల్ అన్నారు. చాలా కాలంగా అవి దొడ్డికే పరిమితం కావడం కారణంగా అలా తిరిగి ఉంటాయని ఆయన బలంగా చెబుతున్నారు. ఉత్తర చైనాలోని మంగోలియాకు సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఇది వెలుగు చూసిన ఈ ఘటనపై అనేక విశ్లేషణలు వచ్చినప్పటికీ మ్యాట్ వెల్ విశ్లేషణ ఎక్కువ మందిని సంతృప్తి పరుస్తోంది.

‘‘అవి చాలా కాలంగా దొడ్డికే పరిమితమై ఉండొచ్చు. ఆ సమయంలో అవి దొడ్డిలోనే అలా తిరిగి తిరిగి.. దొడ్డి బయటకు వచ్చినప్పటికీ కూడా అదే అలవాటులో వృత్తాకారంలో తిరిగి ఉంటాయి. ఇలా ముందు కొన్ని గొర్రెలు చేయగానే, మిగిలిన గొర్రెలు వాటిని అనుకరించాయి. ఇది అంత పెద్ద పరిణామం ఏం కాదు’’ అని మ్యాట్ బెల్ అన్నారు.

వీడియో ప్రకారం.. కొన్ని పదుల సంఖ్యలో గొర్రెలు సవ్యదిశలో సమూహంగా తిరగడం చూడొచ్చు. కొన్ని ఎలాంటి దిశ లేకుండా కదులుతున్నాయి. అయితే ఒక దిశలో తిరిగే గొర్రెలు, కచ్చితమైన వృత్తాకారంలో తిరుగుతున్నాయి. అలా తిరుగుతూనే ఉన్నాయి. ఈ వృత్తాకారంలో కొన్ని గొర్రెలు కలుస్తున్నాయి, కొన్ని వదిలి వెళ్తున్నాయి. కానీ, మొత్తంగా గొర్రెలంతా వృత్తాకారాన్ని వదలకుండా తిరుగుతూనే ఉన్నాయి.

మొదట తక్కువ గొర్రెలు ఇలా ప్రవర్తించాయట. క్రమంగా వాటికి తోడుగా మరిన్ని గొర్రెలు చేరుతున్నాయని ఆ గొర్రెల యజమాని పేర్కొన్నాడు. అయితే ఆ గొర్రెలు లిస్టెరియోసిస్ అనే బాక్టీరియల్ వ్యాధి వల్ల అలా చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిని “సర్క్లింగ్ డిసీజ్” అని కూడా పిలుస్తారని వారు పేర్కొన్నారు.

Viral Video: సెంచరీ బాది డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ తన గ్లోవ్స్‌ను చిన్నారికిచ్చిన వార్నర్.. ఉబ్బితబ్బిబ్బయిన బాలుడు