Man Selfie With Fish: అయ్యయ్యో..! చేపకు బదులు ఫోన్‌ను నీటిలోకి విసిరేసిన వ్యక్తి.. నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్న వీడియో
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక కొందరు సెల్ఫీల మోజులోపడి ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ..

Man Selfie With Fish
Man Selfie With Fish: స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక కొందరు సెల్ఫీల మోజులోపడి ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ.. చేపకు బదులు తన ఖరీదైన సెల్‍ను సముద్రంలోకి విసిరేశాడు. క్షణాల్లో తేరుకున్న అతను తన సెల్‌ఫోన్ ను అందుకునే ప్రయత్నంలో అతడి ఫీలింగ్స్ నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది.
నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ ఫన్నీ వీడియోలో ఓ వ్యక్తి మోటార్ బోట్ లో సముద్రంలో సరదాగా చేపలు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ చేప అతని చేతికి చిక్కింది. ఆ చేపను పైకి చూపెడుతూ తన సెల్ ఫోన్ లో సెల్ఫీలు తీసుకున్నాడు. కొద్దిసేపు సంతోషంగా అలా సెల్ఫీలు దిగాడు. ఆ సమయంలో అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. మళ్లీ దానిని సముద్రంలోకి విసిరేసేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చేపను విసిరేయబోయి తన మరోచేతిలో ఉన్న ఖరీదైన సెల్ ఫోన్ ను సముద్రంలోకి విసిరేశాడు. వెంటనే తేరుకున్న అతను దానిని అందుకొనే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తన సెల్ సముద్రంలో పడిపోవటంతో అతని ముఖ్యంలో ఆహభావాలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి.
— Tansu YEĞEN (@TansuYegen) September 11, 2022
ఈ వీడియోలో సన్నివేశం ఎక్కడ జరిగిందనే సమాచారం లేనప్పటికీ.. ఈ వీడియోను పోస్టుచేసిన కొద్దిగంటల్లోనే లక్షలాది మంది నెటిజన్లు వీక్షించారు. కొందరు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘హ-హ-హ-హ-హ ఆ చేప తన ఫోన్ కంటే ఖరీదైనది’ అని ఓ నెటిజన్ రాశారు. అతిగా ఆనందపడితే ఇలాంటి అనర్థాలే జరుగుతాయంటూ మరో నెటిజన్ రాశాడు. అయ్యే పాపం.. చేప మిగిలే.. సెల్ ఫోన్ పాయే అంటూ మరో నెటిజన్ రాశాడు. ఇలా పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.