Ox On Bike: ఎంత చక్కగా కూర్చుందో..! బైక్‌పై ఎద్దును తీసుకెళ్లిన వ్యక్తి.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వీడియో

మీరెప్పుడైనా మీ ఇంట్లోని సాదు జంతువులను బైక్‌పై తీసుకెళ్లారా.. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కాదండోయ్..! గేదెలు, ఆవులు లాంటివి..! వాటినెలా తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.

Ox On Bike: ఎంత చక్కగా కూర్చుందో..! బైక్‌పై ఎద్దును తీసుకెళ్లిన వ్యక్తి.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వీడియో

Ox On Bike

Ox On Bike: మీరెప్పుడైనా మీ ఇంట్లోని సాదు జంతువులను బైక్‌పై తీసుకెళ్లారా.. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కాదండోయ్..! గేదెలు, ఆవులు లాంటివి..! వాటినెలా తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ వీడియో చూడండి. ఓ వ్యక్తి భారీకాయం కలిగిన ఎద్దును తన మోటార్ సైకిల్‌పై తీసుకెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టిట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘వీడు మామూలోడో కాదు..’, ‘నువ్వు గ్రేట్ సామి’ అంటూ పేర్కొంటున్నారు. బైక్ నడిపే వ్యక్తి గురించి అలా ఉంచితే.. ఆ ఎద్దుసైతం బైక్‌పై కదలకుండా చక్కగా కూర్చుంది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Viral Video: దీని దుంపతెగ..! పార్టీలోకి దూసుకొచ్చిన సింహం.. యువకుడు చెట్టెక్కినా వదల్లేదు..

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను inthenaturetoday అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఓ భారీకాయం కలిగిన ఎద్దును బైక్ వెనుకాల సీటుపై కూర్చోబెట్టి తాళ్లతో కట్టారు. బైక్ ను వ్యక్తి వేగంగా పోనివ్వడం వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. పెద్దవాహనంలో ఎక్కించినా అలాంటి జంతువులు కదులుతూ ఉంటాయి.. కానీ ఒక్క మనిషి కూర్చొనే సీటుభాగంలో ఆ ఎద్దు ఎలాంటి కదలికలేకుండా హాయిగా ఎలా కూర్చుందనే విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  బైక్ నడిపే వ్యక్తిసైతం బైక్ ను బ్యాలెన్స్ గా నడపుతుండటం వీడియోలో చూడొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by All in Animals (@animalsinthenaturetoday)

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేస్తుండగా, మరికొందరు వినోధభరితంగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్.. వామ్మో.. ఇలాంటి వీడియోను నేనెప్పుడూ చూడలేదు. మరీ ఇంత సాహసమా.. అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. ఇది తమాషా కాదు.. అని రాయగా.. సూపర్ యానిమల్ టాక్సీ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు.