Viral Video: బాప్ రే.. కప్పనే ఎత్తుకెళ్లిన కందిరీగ!

ఈ సృష్టిలో ఒక్కో ప్రాణి తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఒక్కో ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. అలాగే కప్ప కూడా ఒక చోట స్థిరంగా ఉంటూ చుట్టూ ఉండే కీటకాలను నాలుకతో లాగేసుకొని మింగేస్తుంది. దీనికి తన పొడవైన నాలుక బాగా ఉపకరిస్తుంది.

Viral Video: బాప్ రే.. కప్పనే ఎత్తుకెళ్లిన కందిరీగ!

Viral Video (1)

Updated On : July 3, 2021 / 10:24 PM IST

Viral Video: ఈ సృష్టిలో ఒక్కో ప్రాణి తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఒక్కో ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. అలాగే కప్ప కూడా ఒక చోట స్థిరంగా ఉంటూ చుట్టూ ఉండే కీటకాలను నాలుకతో లాగేసుకొని మింగేస్తుంది. దీనికి తన పొడవైన నాలుక బాగా ఉపకరిస్తుంది. గాల్లో తిరిగే పురుగులు, కీటకాలను కూడా కప్ప ఈ నాలుకతోనే లాక్కొని మింగేస్తుంది. కానీ ఆ నాలుకే తనకు శాపమై తనలో పదవ వంతు కూడా లేని ఓ పురుగు తననే ఎగరేసుకుపోయేలా చేసింది.

ఓ చోట ఉన్న కప్ప అటుగా వచ్చిన పురుగులను నాలుకతో కరచుకొని తింటుంది. అలానే ఓ కందిరీగ కూడా కప్ప దగ్గరకు రావడంతో దాన్ని కూడా కప్ప నాలుకకు కరుచుకుంది. కానీ ఆ కందిరీగ రెక్కలు అప్పటికి ఇంకా అలానే విప్పారి ఉండడంతో కందిరీగ తెలివిగా మరికాస్త స్పీడుగా వాటిని ఆడించసాగింది. అంతే కప్ప కూడా అలానే కందిరీగతో గాల్లోకి ఎగిరిపోయింది.

కప్ప నాలుకతో లాగేసుకున్నప్పుడే వెంటనే నోట్లోకి తీసుకుంటుంది. కానీ.. కాస్త ఆలస్యమవడంతో కందిరీగ తన ప్రతాపం చూపించింది. ఫలితంగా తనకంటే చాలా బరువైన కప్పను కూడా ఆ కందిరీగ గాల్లో ఎగరేసుకుపోయింది. ప్రకృతిలో ఇలాంటి దృశ్యాలు అరుదుగా జరుగుతుంటాయి. కానీ.. ఇలాంటి నమ్మలేని అరుదైన దృశ్యాలనే ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకుంటారు. అలా పంచుకున్న ఈ వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.