Watch Video : స్విమ్మింగ్ పూల్‌లో దూకుతున్న పిల్లాడు.. తల్లి ఎలా కాపాడిందో చూడండి.. సూపర్ మామ్..!
Watch Video : తన పిల్లల్ని కాపాడుకోవడంలో తల్లిని మించి మరొకటి లేదు. తనకు ఏమైనా పర్వాలేదు.. కానీ, తన పిల్లలకు ఆపద వస్తే.. ఎంతమాత్రం ఊరుకోదు.

Mom Reflexes Mother Catches Son Jumping Into Swimming Pool Mid Air With One Hand, Saves The Day – Watch
Watch Video : తన పిల్లల్ని కాపాడుకోవడంలో తల్లిని మించి మరొకటి లేదు. తనకు ఏమైనా పర్వాలేదు.. కానీ, తన పిల్లలకు ఆపద వస్తే.. ఎంతమాత్రం ఊరుకోదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా పిల్లలను రక్షించుకుంటుంది. అది అమ్మంటే.. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్న పిల్లాడిని తల్లి కాపాడుకుంది.
ఆడుకుంటున్న వెళ్తున్న ఓ పిల్లాడు స్విమ్మింగ్ పూల్ లోకి దూకేశాడు. అతన్ని గమనించిన తల్లి పిల్లాడి వెనుకనే వెళ్లింది. స్విమ్మింగ్ పూల్ లోకి ఇలా దూకేశాడో లేదో వెంటనే ఒంటి చేత్తో గాల్లోనే పిల్లాడి పట్టేసుకుంది. అంతే.. నీటిపై పిల్లాడు తేలియాడుతూ కనిపించాడు.
దీనికి సంబంధించిన వీడియోను ది ఫిగెన్ అనే యూజర్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పిల్లాడు ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తుంటాడు. క్షణాల వ్యవధిలో అతన్ని చేరుకున్న తల్లి వెనుక నుంచి సింగిల్ హ్యాండ్ తో పిల్లాడి చొక్కాను పట్టేసుకుంది.
Mother of the year!? pic.twitter.com/TIXn8P85gx
— Figen (@TheFigen) April 30, 2022
వీడియోను చూసిన నెటిజన్లంతా హ్యాట్సాఫ్ మామ్ అంటూ అభినందిస్తున్నారు. ఈ ఏడాదిలో బెస్ట్ మదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 9 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు 5 లక్షల పైనే వ్యూస్ వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి..
Read Also : Viral Video: నవ్వు తెప్పిస్తున్న సీ లయన్.. ఇంతకీ ఏం చేసిందంటే