OMG.. గ్లాస్ బీరుకు ఎంత డబ్బు చెల్లించాడో తెలుసా!

  • Published By: veegamteam ,Published On : September 7, 2019 / 07:20 AM IST
OMG.. గ్లాస్ బీరుకు ఎంత డబ్బు చెల్లించాడో తెలుసా!

Updated On : September 7, 2019 / 7:20 AM IST

ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి గ్లాసు బీరు తాగి ఎంత డబ్బు చెల్లించాడో తెలిస్తే కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఒకే ఒక్క గ్లాస్ బీరుకు రూ. 70 లక్షలు చెల్లించాడు. అయితే అసలు విషయం ఏంటంటే…అతనికి తెలియకుండానే అంత డబ్బు పే చేశాడట. మరి చివరికి ఏం జరిగిందో చూద్దాం.

వివరాలు… ఆస్ట్రేలియాకు చెందిన పీటర్‌ లాలర్‌ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మాల్‌మేసన్‌ అనే హోటల్‌కు వెళ్లాడు. అక్కడ అమెరికన్‌ ది కాకుండా బ్రిటీష్‌ బీరు ఆర్డర్‌ చేశాడు. బాగా తాగిన తర్వాత కార్డుతో డబ్బులు కట్టేశాడు. ఎందుకో డౌట్ వచ్చి అసలు నేను బీరుకు ఎంత డబ్బులు చెల్లించానో తెలుసుకుందామని హోటల్‌ సిబ్బందిని అడిగాడు. దీంతో హోటల్ సిబ్బంది బిల్ ఎంతైందో చెప్పడానికి తడబడుతున్నాడు. పీటర్‌ గట్టిగా అడిగేసరికి రూ. 70 లక్షలు చెల్లించారని చెప్పేశాడు. దీంతో పీటర్ షాక్ అయ్యాడు.   

ఈ సందర్భంగా పీటర్‌ మాట్లాడుతూ.. హోటల్‌ సిబ్బంది పొరపాటు వల్లే బిల్‌ ఎక్కువగా వేసినట్లు తెలియడంతో మిగతా డబ్బును వీలైనంత త్వరగా వెనక్కు ఇచ్చే ఏర్పాటు చేస్తామని యాజమాన్యం తెలిపారు.  అంతేకాకుండా జరిగిన పొరపాటుకు క్షమించమని అడిగారు.