Latest Mehndi Design : ఓ పెళ్లికూతురి మెహందీ డిజైన్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు
గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారు. పెళ్లి సమయాల్లో అయితే రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుంటారు. ఓ పెళ్లికూతురు తన పెళ్లికి పెట్టించుకున్న మెహందీ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest Mehndi Design
Latest Mehndi Design : పెళ్లంటే పందిళ్లు, మేళతాళాలు, సంగీత్ లు.. ఇవన్నీ కామనే. ఇక పెళ్లి టైంలో మెహందీ (mehandi) ఫంక్షన్ కూడా చేస్తారు. ఇక ఆరోజు వధువు (bride) కాళ్లకి, చేతులకి ఎక్స్ పర్ట్స్ అయిన డిజైనర్లు అందంగా గోరింటాకు పెడతారు. జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి వేడుకల్లో ఇప్పుడు ప్రతీదీ ప్రత్యేకంగా జరుపుకోవాలని అనుకుంటున్నారు. ఓ వధువు తన మెహందీ డిజైన్ ఎంత వెరైటీగా వేయించుకుందంటే..
Mud Puddling : బురద నుంచి సాల్ట్ సేకరిస్తున్న రంగు రంగుల సీతాకోక చిలుకల వీడియో వైరల్
ఎవరూ చేయనిది మనం చేస్తే ఇప్పుడు వైరల్. కావాలని అలా ఆలోచిస్తున్నారో.. క్రియేటివ్ గా థింక్ చేస్తున్నారో తెలియదు కానీ కొందరు వాళ్లు చేసే పనులతో భలే వైరల్ అయిపోతున్నారు. అందరూ పెళ్లిలో పెట్టుకున్నట్లు మెహందీ పెట్టుకుంటే అందులో ఏం ఉంది అనుకుందో ఏమో? ఓ నూతన వధువు వెరైటీగా డిజైన్ వేయించుకుంది. తను పెళ్లిచేసుకోబోతున్న జీవిత భాగస్వామిని (life partner) తాను ఇన్ స్టాల్ ఎప్పుడు కలిసింది.. ఎప్పుడు ప్రపోజ్ (propose) చేసుకున్నారు.. మొదటిసారి ఎప్పుడు కలిసారు.. ఇక పెళ్లి రోజు అన్ని తేదీ,నెల.. సంవత్సరంతో పాటు డిజైన్ వేయించుకుంది. దిశా తుమ్కర్ (Disha Tumkar) ఈ పెళ్లికూతురు తన ఇన్ స్టా టైం లైన్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ ఐడియా బాగుందని కొందరు.. మీ కల నెరవేరుతున్నందుకు శుభాకాంక్షలు అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా పెళ్లి సందర్భంలో జీవితకాలం గుర్తుండిపోయే విధంగా మెహందీ డిజైన్ వేయించుకున్న ఈ పెళ్లికూతురి క్రియేటివిటీని అందరూ మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram