Delhi Police : అద్భుతంగా పాట పాడిన ఢిల్లీ పోలీస్.. సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న వీడియో

పోలీసులకు అసలు తీరిక ఉంటుందా? ఒకవేళ దొరికితే ఏం చేస్తారు. ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఇప్పుడు జనం మనసు దోచుకున్నారు. ఇంతకీ ఆయన టాలెంట్ ఏంటి? అంటే..

Delhi Police : అద్భుతంగా పాట పాడిన ఢిల్లీ పోలీస్.. సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న వీడియో

Delhi Police

Delhi Police : పోలీసులు(police) ఎప్పుడు విధి నిర్వహణలో సీరియస్ గా ఉంటారని అపోహ పడతాం.  కానీ వాళ్లలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బోలెడు టాలెంట్స్ కూడా ఉంటాయి. ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్ (Rajat Rathor) టాలెంట్ ని జనం మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆయనకున్న టాలెంట్ ఏంటి? అంటే..

ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్ వృత్తిలో చాలా సీరియస్ గా ఉంటారు. అయితే ఈయనలో అద్భుతంగా పాటలు పాడే (singing) టాలెంట్ ఉంది. తన పాటలతో ఇప్పుడు అందరి మనసు దోచుకుంటున్నారు. పోలీసులు ఎప్పుడు ఏదో ఒక కేసుల విషయంలో బిజీ బిజీగా తిరుగుతుంటారు. బందోబస్తులు, శాంతి భద్రతలను నిర్వహించడంలో తీరిక లేకుండా ఉంటారు. కానీ కొంచెం ఖాళీ దొరికితే రజత్ రాథోర్ అద్భుతంగా పాటలు పాడతారు. రీసెంట్ గా ఆయన పాడిన పాట అందరినీ ఉర్రూతలూగిస్తోంది.

రజత్ రాథోర్ తను పాడిన పాటను తన ట్విట్టర్  అకౌంట్‌లో షేర్ చేయడంతో జనం అతని టాలెంట్ కి అభినందనలు తెలుపుతున్నారు. వాయిస్ అద్భుతంగా ఉందని కొందరు..సెకండ్ అర్జీత్ సింగ్ అని ఒకరు ఇలా స్పందిస్తూ ఉన్నారు. ఈయన పాటకు అద్దిరిపోయే వ్యూస్ వస్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Rajat Rathor (@rajat.rathor.rj)