వెచ్చదనం కోసం: పులులు, సింహాలకు హీటర్లు

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 05:12 AM IST
వెచ్చదనం కోసం: పులులు, సింహాలకు హీటర్లు

Updated On : January 1, 2020 / 5:12 AM IST

మనం సాధారణంగా కొంచెం చలి పెడితే చాలు ఇట్లోంచి బయటకు రావాలంటే చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడు బయట తిరిగే మూగ జంతువులకు చలి పెట్టదా అనే సందేహాం వస్తుంది. అవి కూడా మనలాగే చలి నుంచి తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తుంటాయి. మరి జూ లో ఉండే జంతువుల సంగతి ఏమిటి ? ఎప్పుడు చలికి వణుకుతూ ఉండాల్సిందేనా. 

అస్సాంలోని స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ అధికారులు మాత్రం బోనులో ఉండే జంతువుల కోసం  ఏదైనా చేయాలనే ఒక కొత్త ఆలోచనతో హీటర్లను ఏర్పాటు చేసింది. బోనుల ఉన్న పులులు, సింహాలు వెచ్చదనాన్ని కలిగించేందుకు బయట నుంచి ఎన్ క్లోజర్ హీటర్లను ఏర్పాటు చేసింది. అన్ని జంతువులకు హీటర్ మంచిది కాదు. జింక, ఇతర జంతువులకు మాత్రం గడ్డి తయారు చేసిన స్ట్రాల్స్ ను ఏర్పాటు చేశాం అని జూ ఇన్ చార్జి ప్రవీణ్ అన్నారు.